India WTC 400 Plus Scores Record: WTCలో భారత్ ప్రపంచ రికార్డు.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టిన టీమిండియా!
India WTC 400 Plus Scores Record: కొలంబో టెస్టులో భారీ స్కోరు సాధించిన టీమిండియా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి భారత్ కొత్త రికార్డు సృష్టించింది.
India WTC 400 Plus Scores Record: WTCలో భారత్ ప్రపంచ రికార్డు.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టిన టీమిండియా
India WTC 400 Plus Scores Record: శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 503/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈ భారీ స్కోరు సమయంలో 400 పరుగుల మార్క్ దాటడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ చరిత్రలో భారత్ అరుదైన రికార్డు నమోదు చేసింది.
2019లో WTC ప్రారంభమైన తర్వాత అత్యధికసార్లు 400కు పైగా స్కోరు చేసిన జట్టుగా భారత్ నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్, ఆస్ట్రేలియా చెరో 26 సార్లు ఈ ఘనత సాధించి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి.
కొలంబోలో మరోసారి 400 దాటడంతో భారత్ 27వసారి ఈ మార్క్‌ను అందుకుని ఒంటరిగా నంబర్‌వన్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా 26 సార్లతో రెండో స్థానానికి వెళ్లగా, ఇంగ్లాండ్ 23 సార్లు 400కు పైగా పరుగులు చేసి తర్వాతి స్థానంలో ఉంది.
పడిక్కల్, జురెల్ శతకాలతో భారీ స్కోరు..
భారత్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ వికెట్లు కోల్పోయింది. రాహుల్ 18 పరుగులు చేయగా, జైస్వాల్ 45 పరుగులు సాధించాడు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 120 పరుగులు జోడించాడు. గిల్ 50 పరుగులు చేశాడు.
పడిక్కల్ తర్వాత కూడా భారత్ స్కోరు వేగం తగ్గలేదు. జడేజా 43 పరుగులు చేశాడు. పడిక్కల్ 117 పరుగులు సాధించగా, రిషభ్ పంత్ 63 పరుగులతో కీలక సహకారం అందించాడు. మరోవైపు ధ్రువ్ జురెల్ 115 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పడిక్కల్, జురెల్ శతకాలతో భారత్ 503 పరుగుల భారీ స్కోరును అందుకుంది.
శ్రీలంకపై భారత్‌కు భారీ ఆధిక్యం..
వర్షం కారణంగా కొలంబో టెస్టులో ఆట పలుమార్లు నిలిచింది. భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తర్వాత శ్రీలంక మూడు ఓవర్లు మాత్రమే ఆడి 2 వికెట్లకు 8 పరుగులు చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ లాహిరు ఉదారాను 1 పరుగుకే పెవిలియన్‌కు పంపగా, మానవ్ సుథార్ ప్రభాత్ జయసూర్యను 2 పరుగుల వద్ద ఔట్ చేశాడు.
ఇక మూడో రోజు ఆట మొదలైంది. వార్త రాసే సమయానికి శ్రీలంక జట్టు 3 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. ఇంకా 454 పరుగుల వెనుకంజలో నిలిచింది. WTCలో అత్యధికసార్లు 400కు పైగా పరుగులు చేసిన జట్టుగా భారత్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. కొలంబోలో పడ్డికల్, జురెల్ శతకాలతో వచ్చిన భారీ స్కోరు ఈ ఘనతకు కారణమైంది.




