బీసీసీఐ సంచలన నిర్ణయం.. సూర్యపై వేటు.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు కొత్త కెప్టెన్‌తో సరికొత్త టీం?
Team India: సుదీర్ఘ విరామం తర్వాత పొట్టి ఫార్మాట్‌లోకి అడుగుపెడుతున్న అయ్యర్‌కు ఏకంగా సారథ్య బాధ్యతలు అప్పగించబోతున్నట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది.
బీసీసీఐ సంచలన నిర్ణయం.. సూర్యపై వేటు.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు కొత్త కెప్టెన్‌తో సరికొత్త టీం?
Team India: దాదాపు 3 నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు మళ్లీ మైదానంలోకి దిగడానికి సిద్ధమవుతోంది. జూన్ చివరి వారంలో ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఆపై జూలైలో ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ కోసం టీమిండియా విదేశాలకు పయనం కానుంది. అయితే ఈ ఏడు మ్యాచ్‌ల కోసం బీసీసీఐ ప్రకటించబోయే 15 మంది సభ్యుల జట్టులో ఊహించని భారీ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది.
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. వైస్ కెప్టెన్‌గా తెలుగు కుర్రాడు!
ఈ పర్యటనకు సంబంధించి అత్యంత షాకింగ్ వార్త ఏమిటంటే, ప్రస్తుత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించనున్నట్లు సమాచారం. సుదీర్ఘ విరామం తర్వాత పొట్టి ఫార్మాట్‌లోకి అడుగుపెడుతున్న శ్రేయస్ అయ్యర్‌కు ఏకంగా సారథ్య బాధ్యతలు అప్పగించబోతున్నట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అంతేకాదు, వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్ స్థానంలో తెలుగు తేజం తిలక్ వర్మకు ప్రమోషన్ లభించనుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సెలక్టర్లు ఈ యువ ఆటగాడికి డిప్యూటీ కెప్టెన్ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు.
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ? భువీ, రజత్ పాటిదార్లకు పిలుపు..
ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వరద పారించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి ఈ పర్యటనలో చోటు దక్కే అవకాశం ఉంది. అతడిని జట్టులోకి తీసుకుంటే అది ఒక చారిత్రాత్మక నిర్ణయం కానుంది.
మరోవైపు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన రజత్ పాటిదార్‌తో పాటు, ఈ ఐపీఎల్‌లో 28 వికెట్లతో పాత రోజులను గుర్తు చేసిన స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ కూడా తిరిగి టీమిండియా నీలి రంగు జెర్సీని ధరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వరల్డ్ కప్ హీరోలపై వేటు.. హార్దిక్, బుమ్రాలకు విశ్రాంతి..
కొత్త రక్తాన్ని ఎక్కించే క్రమంలో కొందరు సీనియర్లపై సెలక్టర్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఇటీవల ఐపీఎల్‌లో ఆకట్టుకోలేకపోయిన రింకూ సింగ్ పైనా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వేటు వేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కింద ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రాలకు ఈ టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు. హార్దిక్ కేవలం ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ నాటికి జట్టుతో చెయ్యి కలపనున్నాడు.
ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత సంభావ్య జట్టు (Predictable Squad):
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, రజత్ పాటిదార్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్.
సూర్యకుమార్ యాదవ్ లాంటి విధ్వంసకర ఆటగాడిని పక్కనపెట్టి, శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో సరికొత్త ప్రయోగానికి టీమిండియా తెరలేపడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. యువతరం జోష్, సీనియర్ల అనుభవంతో కూడిన ఈ నయా సైన్యం ఇంగ్లండ్, ఐర్లాండ్ గడ్డపై ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.




