Jay Shah: ప్రపంచ క్రికెట్‌పై మళ్లీ జే షా ముద్ర.. ఐసీసీ ఛైర్మన్‌గా రెండోసారి ఎన్నిక

Jay Shah: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఛైర్మన్‌గా జే షా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Arun Chilukuri
Published on: 16 Nov 2026 11:14 AM IST
Jay Shah
X

Jay Shah: ప్రపంచ క్రికెట్‌పై మళ్లీ జే షా ముద్ర.. ఐసీసీ ఛైర్మన్‌గా రెండోసారి ఎన్నిక

Jay Shah: ప్రపంచ క్రికెట్ పాలనా సంస్థ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఛైర్మన్‌గా భారతీయుడు జే షా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇండోనేషియాలోని బాలి వేదికగా జరిగిన ఐసీసీ బోర్డు సమావేశాల్లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ డైరెక్టర్ల ప్రతిపాదన మేరకు జే షా పునర్నియామకాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.

బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్‌లో ఛైర్మన్ పదవికి సంబంధించి జే షా పేరును డైరెక్టర్లు ప్రతిపాదించగా, సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఆయనపై మరెవరూ పోటీకి నిలవకపోవడంతో రెండోసారి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. త్వరలోనే ఆయన రెండో విడత ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

బీసీసీఐ కార్యదర్శిగా పనిచేసిన అనుభవంతో తొలిసారి ఐసీసీ పగ్గాలు చేపట్టిన జే షా, అంతర్జాతీయ క్రికెట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మరోసారి ప్రపంచ క్రికెట్ అత్యున్నత సంస్థకు నాయకత్వం వహించే అవకాశం దక్కడం భారత క్రికెట్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. జే షా రెండోసారి ఐసీసీ ఛైర్మన్‌గా నియమితులవడంపై క్రీడా ప్రముఖులు, వివిధ దేశాల క్రికెట్ బోర్డులు అభినందనలు తెలుపుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.