IPL: 15 ఏళ్ల వ‌య‌సులోనే సంచ‌ల‌నం.. స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన చిచ్చ‌ర పిడుగు

IPL: ప్రపంచ క్రికెట్‌లో కొత్త స్టార్‌గా వెలుగొందుతున్న పేరు వైభ‌వ్ సూర్య‌వంశీ కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

Mokshith
Published on: 26 April 2026 1:40 PM IST
IPL
X

IPL: 15 ఏళ్ల వ‌య‌సులోనే సంచ‌ల‌నం.. స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన చిచ్చ‌ర పిడుగు

IPL: ప్రపంచ క్రికెట్‌లో కొత్త స్టార్‌గా వెలుగొందుతున్న పేరు వైభ‌వ్ సూర్య‌వంశీ కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇటీవల జరిగిన మ్యాచ్‌లో అతని బ్యాటింగ్ స్టైల్, వేగం చూసి క్రికెట్ ప్రపంచం షాక్ అయ్యింది.

500 బంతుల్లోపు 1000 పరుగులు

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై జరిగిన మ్యాచ్‌లో వైభవ్ మెరుపు సెంచరీతో టీ20ల్లో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అయితే ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఫీట్‌ను అతను కేవలం 473 బంతుల్లోనే సాధించాడు. ఇప్పటివరకు ఎవరూ 500 బంతుల్లోపు ఈ మార్క్‌ను అందుకోలేదు. ఇదివరకు ఈ రికార్డు మిచ్చెల్ ఓవెన్ (533 బంతులు) పేరిట ఉండేది. అలాగే అండ్రూ సైమండ్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. వారందరినీ దాటేసి వైభవ్ కొత్త చరిత్ర రాశాడు.

స్ట్రైక్ రేట్ చూస్తే ఆశ్చర్యమే

ఇప్పటివరకు 26 టీ20 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ 1058 పరుగులు చేశాడు. అతని సగటు 42.32 కాగా, స్ట్రైక్ రేట్ 213.73గా ఉంది. అంటే అతను ప్రతి బంతికి దాదాపు రెండు పరుగులు సాధిస్తున్నట్టే. ఇప్పటివరకు 4 సెంచరీలు, 94 సిక్సర్లు బాదాడు. ఇంకొన్ని సిక్సర్లు కొడితే అత్యంత వేగంగా 100 సిక్సర్ల రికార్డును కూడా చేరుకునే అవకాశముంది.

ఐపీఎల్‌లో వైభవ్ దూకుడుతో ఆడుతున్నాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ర‌ఫున ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడి 609 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 222.26గా ఉండటం విశేషం. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ ఇలా ఆడటం అతని టాలెంట్‌కు నిదర్శనం.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌పై వైభవ్ 37 బంతుల్లో 103 పరుగులు చేసి అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అతని జట్టు గెలవలేకపోయింది. రాజస్థాన్ 228 పరుగులు చేసినా, ప్రత్యర్థి జట్టు లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ గాయపడటం కూడా జట్టుకు మరో షాక్‌గా మారింది. అయినప్పటికీ అతని ప్రదర్శన మాత్రం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story