IPL 2026: బౌలర్లకు భయానక సీజన్ ఇదే.. 200+ స్కోర్లు అత్యధికసార్లు ఇచ్చిన టీమ్స్ ఇవే!
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో బ్యాటర్ల ఆధిపత్యంతో కొనసాగుతోంది.
IPL 2026: బౌలర్లకు భయానక సీజన్ ఇదే.. 200+ స్కోర్లు అత్యధికసార్లు ఇచ్చిన టీమ్స్ ఇవే!
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో బ్యాటర్ల ఆధిపత్యంతో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో దాదాపు ప్రతి మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ముఖ్యంగా 200 ప్లస్ టార్గెట్లు ఇప్పుడు సాధారణంగా మారిపోయాయి. అయితే కొన్ని జట్లు మాత్రం బౌలింగ్ వైఫల్యాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు అత్యధిక సార్లు 200కు పైగా పరుగులు ఇచ్చిన జట్ల జాబితాలో టాప్‌లో నిలిచాయి.
ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలో 7 సార్లు ప్రత్యర్థులకు 200కి పైగా పరుగులు సమర్పించుకున్నాయి. బ్యాటింగ్‌లో ఈ రెండు జట్లు దూకుడుగా ఆడుతున్నప్పటికీ.. బౌలర్లు మాత్రం తేలిపోతున్నారు. భారీ స్కోర్లు చేసినా.. వాటిని కాపాడుకోవడంలో విఫలమవుతుండటంతో కీలక మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంటున్నాయి. పేలవ బౌలింగ్ కారణంగా ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉండాల్సిన పంజాబ్, రాజస్థాన్ జట్లు వరుసగా నాలుగు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ వరుసగా నాలుగు మ్యాచులలో ఓడి మూల్యం చెల్లించుకుంది.
ఈ జాబితాలో మూడో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఉన్నాయి. ఈ రెండు జట్లు చెరో 6 సార్లు 200 ప్లస్ స్కోర్లు ఇచ్చాయి. ఆర్సీబీ బ్యాటింగ్ బలంగా ఉన్నప్పటికీ.. బౌలింగ్‌లో స్థిరత్వం లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలో 5 సార్లు 200కిపైగా పరుగులు ఇచ్చాయి. ముఖ్యంగా ఎస్‌ఆర్‌హెచ్ ఈ సీజన్‌లో అత్యంత ప్రమాదకర బ్యాటింగ్ జట్టుగా ఉన్నప్పటికీ.. వారి బౌలింగ్ యూనిట్ కూడా కొన్ని మ్యాచ్‌ల్లో భారీగా పరుగులు సమర్పించుకుంది.
లక్నో సూపర్ జెయింట్స్ నాలుగు సార్లు 200 ప్లస్ స్కోర్లు ఇచ్చి జాబితాలో తదుపరి స్థానంలో ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలో 3 సార్లు అధిక రన్స్ సమర్పించుకున్నాయి. ఈ రెండు జట్లు బౌలింగ్ పరంగా కొంత మెరుగైన నియంత్రణ చూపించాయని చెప్పాలి. అత్యల్పంగా 200+ స్కోర్లు ఇచ్చిన జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్ నిలిచింది. కేకేఆర్ కేవలం 2 సార్లు మాత్రమే ప్రత్యర్థులకు 200కు పైగా పరుగులు ఇచ్చింది. ఈ గణాంకాలు చూస్తే ఈ సీజన్‌లో బ్యాటర్ల విధ్వంసం ఎంత స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.
ఐపీఎల్ 2026లో అత్యధిక సార్లు 200+ పరుగులు ఇచ్చిన జట్లు:
7 – పంజాబ్ కింగ్స్
7 – రాజస్థాన్ రాయల్స్
6 – ఢిల్లీ క్యాపిటల్స్
6 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
5 – ముంబై ఇండియన్స్
5 – సన్‌రైజర్స్ హైదరాబాద్
4 – లక్నో సూపర్ జెయింట్స్
3 – చెన్నై సూపర్ కింగ్స్
3 – గుజరాత్ టైటాన్స్
2 – కోల్‌కతా నైట్ రైడర్స్




