IPL 2026 Captains Performance: ఐపీఎల్ 2026లో మెరిసిన కెప్టెన్స్.. బెస్ట్ ఎవరో తెలుసా?
IPL 2026 captains performance: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటికే 30 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ సీజన్‌లో కెప్టెన్ల ప్రదర్శన కూడా జట్ల విజయాపజయాలపై కీలక ప్రభావం చూపుతోంది.
IPL 2026 Captains Performance: ఐపీఎల్ 2026లో మెరిసిన కెప్టెన్స్.. బెస్ట్ ఎవరో తెలుసా?
IPL 2026 captains performance: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటికే 30 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. లీగ్ దశ సగానికి చేరుకోగా జట్ల మధ్య పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో దూసుకుపోతోంది. మంచి ఫామ్‌లో ఉన్న ఈ జట్టు ప్లే ఆఫ్స్ దిశగా అడుగులు వేస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలో 8 పాయింట్లతో రెండు, మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ మాత్రం 3 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో నిలిచి తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ఈ సీజన్‌లో కెప్టెన్ల ప్రదర్శన కూడా జట్ల విజయాపజయాలపై కీలక ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు ఐపీఎల్ 2026లో మెరిసిన కెప్టెన్స్ ఎవరో ఓసారి చూద్దాం.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 208 పరుగులతో ఆకట్టుకున్నాడు. సారథ్యంలో కూడా అదరగొడుతున్నాడు. అందుకే పంజాబ్ వరుస విజయాలతో దూసుకెళుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాయకుడు రజత్ పటిదార్ 230 పరుగులతో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్‌గా రాణిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ 265 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచి జట్టుకు ప్రధాన బలంగా మారాడు. అయితే సారథ్యంలో మాత్రం కాస్త వెనకబడి ఉన్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇషాన్ కిషన్ 213 పరుగులతో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. కెప్టెన్సీలో కూడా పర్వాలేదనిపిస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ 147 పరుగులతో జట్టుకు సహకరిస్తున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అజింక్య రహానే 145 పరుగులు చేశాడు. అయితే ఈ ఇద్దరు సారథ్యంలో తేలిపోతున్నారు. సరైన వ్యూహాలు రచించడంలో వెనకపడిపోయారు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 96 పరుగులతో నిరాశపర్చుతున్నాడు. అలాగే కెప్టెన్సీ కూడా ఏమంత బాగాలేదు అనే చెప్పాలి. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ 61 పరుగులు మాత్రమే చేశాడు. అయితే అతడి సారథ్యంలో ఆర్ఆర్ దూసుకెళుతోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 29 పరుగులతో పాటు 5 వికెట్లు తీసి జట్టుకు కీలకంగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా 82 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు తీసి తన ఆల్‌రౌండ్ సామర్థ్యాన్ని చూపించాడు. హార్దిక్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. శ్రేయస్, పటిదార్ అందరికంటే ముందున్నారు.




