IPL 2026: రికార్డు ధరలు, అంతకుమించి అంచనాలు.. ఐపీఎల్ 2026 కెప్టెన్‌లలో 'రారాజు' ఎవరు?

IPL 2026: ప్రతి ప్రాంచైజీ తమ నాయకుడిపై కోట్ల రూపాయలు కుమ్మరించి.. విజయాలపై భారీగా ఆశలు పెట్టుకున్నాయి. అయితే కెప్టెన్‌లు ఈ ధరలకు తగిన న్యాయం చేస్తున్నారా?

Rishvik
Published on: 26 April 2026 5:30 PM IST
IPL 2026
X

IPL 2026: రికార్డు ధరలు, అంతకుమించి అంచనాలు.. ఐపీఎల్ 2026 కెప్టెన్‌లలో 'రారాజు' ఎవరు?

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో కెప్టెన్ల ధరలు చూస్తేనే.. ఈ లీగ్ ఎంతటి భారీ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ప్రతి ప్రాంచైజీ తమ నాయకుడిపై కోట్ల రూపాయలు కుమ్మరించి.. విజయాలపై భారీగా ఆశలు పెట్టుకున్నాయి. అయితే కెప్టెన్‌లు ఈ ధరలకు తగిన న్యాయం చేస్తున్నారా? అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సీజన్‌లో ఇప్పటికే లీగ్ దశలో సగం మ్యాచులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు ఎవరు హిట్ అయ్యారు, ఎవరు నిరాశపరిచారో ఓసారి చూద్దాం.

ఐపీఎల్ 2026లో అత్యధిక ధర పలికిన కెప్టెన్ రిషబ్ పంత్. ఆయనకు లక్నో ఏకంగా రూ.27 కోట్ల భారీ మొత్తం చెల్లించింది. శ్రేయస్ అయ్యర్ రూ.26.7 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. పంజాబ్ అతడిని భారీ ధరకు సొంతం చేసుకుంది. పాట్ కమిన్స్ (హైదరాబాద్), రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై) ఇద్దరూ రూ.18 కోట్ల చొప్పున జట్లను నడిపిస్తున్నారు. అక్షర్ పటేల్ (ఢిల్లీ), శుభమాన్ గిల్ (గుజరాత్) రూ.16.5 కోట్లకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు. రియాన్ పరాగ్ (రాజస్థాన్) రూ.14 కోట్లకు నాయకత్వం వహిస్తుండగా.. రజత్ పటిదార్ రూ.11 కోట్లతో జట్టును ముందుకు తీసుకెళ్తున్నారు. అజింక్య రహానే (కేకేఆర్) కేవలం 1.5 కోట్లతో కెప్టెన్‌గా కొనసాగుతున్నారు.

కెప్టెన్‌లకు ఈ భారీ ధరల నేపథ్యంలో నిజంగా ఎవరు జట్టును అద్భుతంగా నడిపిస్తున్నారనే అనే విషయంలో అభిమానుల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్పంచ్ సాబ్ శ్రేయాస్ అయ్యర్ తన ధరకు న్యాయం చేస్తున్నాడని ఫాన్స్ అంటున్నారు, అటు బ్యాటింగ్, ఇటు సారథ్యం రెండింటిలో అయ్యర్ బెస్ట్ అంటున్నారు. అలాగే రజత్ పాటిదార్ కూడా తన ధరకు న్యాయం చేస్తున్నాడు. సారథిగా , ఆటగాడిగా దూసుకెళుతున్నాడు. శుభ్‌మన్ గిల్ తమ ధరకు తగ్గ ప్రదర్శన చూపుతున్నారని భావిస్తున్నారు.

అక్షర్, పరాగ్, రుతురాజ్ పర్వాలేదనిపిస్తున్నారని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. రిషబ్ పంత్ కు విమర్శలు తప్పడం లేదు. వరుసగా విఫలమవుతున్న ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యకు రూ.16.35 కోట్లు దండగ అని ఫాన్స్ అంటున్నారు. రహానే సారథ్యం కూడా బాగా లేకపోయినా అతడికి ఇచ్చేది తక్కువే కదా అను పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే.. కెప్టెన్‌లలో 'రారాజు' అయ్యర్. ఇక ఐపీఎల్‌లో ధరలు మాత్రమే కాదు, ప్రదర్శనే అసలు ప్రమాణం. కోట్లలో జీతం పొందినా.. జట్టుకు విజయాలు అందించలేకపోతే విమర్శలు తప్పవు. మిగతా మ్యాచ్‌లలో ఈ కెప్టెన్లు తమపై ఉన్న అంచనాలను అందుకుంటారో లేదో చూడాలి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story