IPL: ఐపీఎల్‌లో నిమ్మకాయ మంత్రం వీడియో.. స్పందించిన లలిత్ మోదీ
IPL: ఐపీఎల్ మ్యాచ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఓవైపు క్రికెటర్లు సరికొత్త రికార్డులను సృష్టిస్తుంటే. మరోవైపు క్రియేటర్లు మ్యాచ్‌లను తమ కంటెంట్ క్రియేషన్ కోసం వాడుకుంటున్నారు.
IPL: ఐపీఎల్‌లో నిమ్మకాయ మంత్రం వీడియో.. స్పందించిన లలిత్ మోదీ
IPL: ఐపీఎల్ మ్యాచ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఓవైపు క్రికెటర్లు సరికొత్త రికార్డులను సృష్టిస్తుంటే. మరోవైపు క్రియేటర్లు మ్యాచ్‌లను తమ కంటెంట్ క్రియేషన్ కోసం వాడుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓ అభిమాని చేసి పని నెట్టింట వైరల్ అవుతోంది.
ఐపీఎల్‌లో క్షుద్రపూజల ఆరోపణలు
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒక వింత వివాదం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సమయంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఓ అభిమాని నిమ్మకాయతో ఏదో తంత్రం చేస్తున్నట్టు కనిపించింది. అదే సమయంలో సీఎస్‌కే బ్యాటర్ అవుట్ కావడంతో ఇది క్షుద్రపూజలతో సంబంధం ఉందని కొందరు అనుమానం వ్యక్తం చేశారు.
ఫేక్ లెటర్ అయినా చర్చ మాత్రం ఆగలేదు
ఈ ఘటనపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్టు ఒక లేఖ సోషల్ మీడియాలో తిరిగింది. కానీ తరువాత అది AI ద్వారా తయారైన నకిలీ లేఖ అని తేలింది. అయినప్పటికీ ఈ అంశంపై చర్చ ఆగలేదు. అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ఈ విషయం గురించి పెద్ద ఎత్తున మాట్లాడడం ప్రారంభించారు.
లలిత్ మోదీ వ్యాఖ్యలు సంచలనం
ఈ వివాదంపై ఐపీఎల్ స్థాపకుడు లలిత్ మోదీ స్పందిస్తూ మరింత కలకలం రేపారు. “లేఖ ఫేక్ కావచ్చు, కానీ ఐపీఎల్‌లో ఇలాంటి క్షుద్రపూజలు జరుగుతాయి” అని ఆయన తెలిపారు. గతంలో ఒక జట్టు యజమాని ప్రత్యర్థి జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటి పూజలు చేయించిన విషయం తనకు తెలిసిందని చెప్పారు. 2011లోనే దీనిపై వారిని హెచ్చరించానని వెల్లడించారు. అలాగే ఈ విషయంపై తాను భవిష్యత్తులో సినిమా లేదా సిరీస్ ద్వారా నిజాలు బయటపెడతానని చెప్పారు. లలిత్ మోదీ వ్యాఖ్యలతో ఈ అంశం పెద్ద చర్చకు తెర తీసింది.




