IPL 2026: గిల్ vs కోహ్లీ vs రాహుల్.. ముగ్గురిలో 'ధురంధర్' ఎవరు?, ఊహించలేరు!

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లో గత కొన్నేళ్లుగా టీమిండియా బ్యాటర్స్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ టాప్ బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తున్నారు. వీరు ప్రతి ఏడాది పరుగుల వరద పారిస్తున్నారు. ముఖ్యంగా 2021 నుంచి 2025 వరకు ఈ ముగ్గురు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు.

Rishvik
Published on: 25 March 2026 4:44 PM IST
IPL 2026
X

IPL 2026: గిల్ vs కోహ్లీ vs రాహుల్.. ముగ్గురిలో 'ధురంధర్' ఎవరు?, ఊహించలేరు!

IPL 2026:ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లో గత కొన్నేళ్లుగా టీమిండియా బ్యాటర్స్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ టాప్ బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తున్నారు. వీరు ప్రతి ఏడాది పరుగుల వరద పారిస్తున్నారు. ముఖ్యంగా 2021 నుంచి 2025 వరకు ఈ ముగ్గురు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. వీరి గణాంకాలు చూస్తే.. ఎవరు ఎంత ప్రభావం చూపారో స్పష్టంగా తెలుస్తోంది. గిల్ vs కోహ్లీ vs రాహుల్ మధ్య పోలిక ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ముగ్గురిలో 'ధురంధర్' ఎవరో ఇప్పుడు చూద్దాం.

శుభ్‌మన్ గిల్:

2021 నుంచి 2025 మధ్య శుభ్‌మన్ గిల్ 77 ఇన్నింగ్స్‌లలో 2927 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అతని సగటు 43.04 కాగా.. స్ట్రైక్ రేట్ 143.04గా ఉంది. ఈ ఐదేళ్లలో గిల్ 4 సెంచరీలు, 19 అర్ధశతకాలు నమోదు చేశాడు. ముఖ్యంగా అతని స్ట్రైక్ రేట్ ఈ ముగ్గురిలో కంటే అత్యధికం కావడం విశేషం. దాంతో గిల్ ధురంధర్ అని చెప్పొచ్చు. గిల్ ఇప్పుడు జీటీకి ఆడుతున్నాడు.

విరాట్ కోహ్లీ:

విరాట్ కోహ్లీ 73 ఇన్నింగ్స్‌లలో 2783 పరుగులు చేశాడు. కింగ్ సగటు 46.38గా ఉండగా.. స్ట్రైక్ రేట్ 139.60గా ఉంది. 2021 నుంచి 2025 మధ్య కోహ్లీ 3 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు నమోదు చేసి కన్సిస్టెన్సీ పరంగా తన స్థాయి చూపించాడు. ముఖ్యంగా అర్ధశతకాల సంఖ్య ఎక్కువగా ఉండటం అతని నిలకడను సూచిస్తోంది. ఎన్నో ఏళ్లుగా విరాట్ ఆర్సీబీ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.

కేఎల్ రాహుల్:

కేఎల్ రాహుల్ గణాంకాలు కూడా బాగానే ఉన్నాయి. 2021 నుంచి 2025 మధ్య 64 ఇన్నింగ్స్‌లలో 2575 పరుగులు బాదాడు. రాహుల్ సగటు 47.69తో ఈ ముగ్గురిలో టాప్‌లో ఉన్నాడు. అతని స్ట్రైక్ రేట్ 135.54 కాగా.. 3 సెంచరీలు, 19 ఫిఫ్టీలు నమోదు చేశాడు. రాహుల్ ఎక్కువగా యాంకర్ పాత్రలో ఆడుతూ జట్టుకు మంచి స్కోర్ అందిస్తున్నాడు.

మొత్తంగా చూస్తే:

శుభ్‌మన్ గిల్ అగ్రెసివ్ బ్యాటింగ్‌లో ముందుండగా, విరాట్ కోహ్లీ కన్సిస్టెన్సీలో మెరుగ్గా కనిపిస్తున్నాడు. ఇక కేఎల్ రాహుల్ సగటు పరంగా టాప్‌లో ఉండి యాంకర్ పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ తమ స్టైల్‌లో జట్లకు కీలకంగా మారినట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story