GT vs MI: బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్.. రోహిత్ అవుట్, ముంబై తరఫున ఇద్దరు అరంగేట్రం!
GT vs MI: ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, ముంబై మధ్య కీలక పోరు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది.
GT vs MI: బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్.. రోహిత్ అవుట్, ముంబై తరఫున ఇద్దరు అరంగేట్రం!
GT vs MI: ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలక పోరు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితులు, డ్యూ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్ తెలిపాడు.
'ముందుగా టార్గెట్ తెలిసి ఛేజ్ చేయడం మాకు అనుకూలంగా ఉంటుంది. మా బౌలర్లు పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. మిడిల్ ఓవర్లలో రషీద్ ఖాన్ కీలకంగా మారుతున్నాడు. అదే రిథమ్ కొనసాగించాలని ఆశిస్తున్నాం' అని గిల్ చెప్పాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.. తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమేనని చెప్పాడు. గత మ్యాచ్‌ల్లో జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆటగాళ్లు కలిసి మాట్లాడుకుని మళ్లీ గెలుపు దిశగా సాగేందుకు ప్రణాళికలు రచించామని తెలిపాడు. 'ముంబై ఇండియన్స్ అంటే ఏమిటో మళ్లీ గుర్తుచేసుకుని, ఎలా ఆడాలనుకుంటున్నామో చర్చించుకున్నాం.
మేము ఒకరినొకరు నమ్ముకుంటూ ముందుకు సాగాలి. కష్టకాలంలో కూడా కలిసి నిలబడితేనే మంచి ఫలితాలు వస్తాయి. జట్టులో కొన్ని మార్పులు చేశాం. డానిష్ మలేవార్, కృష్ణ భగత్ ఇద్దరూ ఈ మ్యాచ్‌తో ముంబై తరఫున అరంగేట్రం చేస్తున్నారు. ఇటీవల నెట్ బౌలర్లుగా ఉన్న వారు మంచి ప్రదర్శన చేయడంతో అవకాశం ఇచ్చినట్లు' హార్దిక్ వివరించాడు.
గాయం కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడడం లేదు. అతడి స్థానంలో డానిష్ మలేవార్ ఓపెనింగ్ చేయనున్నాడు. క్వింటన్ డికాక్‌తో కలిసి డానిష్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచిన అముంబై.. ఆ తర్వాత వరుస పరాజయాలు చవిచూసింది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్‌పై గెలవడం తప్పనిసరి. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగింట ఓడిన ముంబై.. గుజరాత్‌పై గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలనే పట్టుదలతో ఉంది.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్: డానిష్ మలేవార్, క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), తిలక్ వర్మ, రూథర్‌ఫోర్డ్, మిచెల్ శాంట్నర్, క్రిష్ భగత్, జస్‌ప్రీత్ బుమ్రా, ఏఎమ్ ఘజన్‌ఫర్.
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, కగిసో రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ, అశోక్ శర్మ.
ఇంపాక్ట్ ప్లేయర్స్:
ముంబై: రాజ్ భావా, అశ్వని కుమార్, కార్బిన్ బోష్, మయాంక్ రావత్, రఘు శర్మ.
గుజరాత్: రాహుల్ తెవాతియా, జాసన్ హోల్డర్, మానవ్ సుతార్, కుల్వంత్ ఖేజ్రోలియా, అనుజ్ రావత్.




