IPL 2026 Schedule: మే నెలలో మరింత హీట్.. ప్లే ఆఫ్స్, ఫైనల్ పోరు.. ఐపీఎల్ 2026 మే షెడ్యూల్ ఇదే!
IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశలోకి అడుగుపెట్టింది. మే నెలలో లీగ్ మ్యాచ్‌ల చివరి దశతో పాటు ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
IPL 2026 Schedule: మే నెలలో మరింత హీట్.. ప్లే ఆఫ్స్, ఫైనల్ పోరు.. ఐపీఎల్ 2026 మే షెడ్యూల్ ఇదే!
IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశలోకి అడుగుపెట్టింది. మార్చి 28న మొదలైన ఈ సీజన్.. ఇపటివేళకు 34 రోజులు ముగియగా, 42 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇక మే నెలలో లీగ్ మ్యాచ్‌ల చివరి దశతో పాటు ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. బీసీసీఐ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మే 24తో లీగ్ దశ ముగుస్తుంది. ఆ తరువాత ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఉండగా.. మే 31న గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మే నెలలో ప్రతి మ్యాచ్ ప్లే ఆఫ్స్ రేసును నిర్ణయించే కీలక పోరుగా మారనుంది. ఈ నేపథ్యంలో మే షెడ్యూల్ ఎలా ఉండనుండో ఓసారి చూద్దాం.
జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో మే షెడ్యూల్ ప్రారంభమవుతుంది. మే 2న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ చెన్నైలో తలపడతాయి. మే 3న డబుల్ హెడ్డర్‌లో భాగంగా మధ్యాహ్నం సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్, రాత్రి గుజరాత్ టైటాన్స్-పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఇదే విధంగా మే నెల మొత్తం ప్రతిరోజూ కీలక మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. మే 10, మే 17, మే 24 తేదీల్లో డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మే 10న చెన్నై-లక్నో, ఆర్సీబీ-ముంబై మ్యాచ్‌లు.. మే 17న పంజాబ్-ఆర్సీబీ, ఢిల్లీ-రాజస్థాన్ మ్యాచ్‌లు.. మే 24న ముంబై-రాజస్థాన్, కోల్‌కతా-ఢిల్లీ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లు ప్లే ఆఫ్స్ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశముంది.
మే 26న క్వాలిఫయర్ 1, మే 27న ఎలిమినేటర్, మే 29న క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక మే 31న ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌తో ఈ సీజన్‌కు తెరపడుతుంది. టాప్-4లో నిలిచే జట్ల మధ్య జరిగే ఈ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ప్రేక్షకులకు హై వోల్టేజ్ థ్రిల్లర్‌ను అందించనున్నాయి. మొత్తంగా మే నెల ఐపీఎల్ అభిమానులకు ఓ పండుగలా మారనుంది. ప్రతి జట్టు ప్లే ఆఫ్స్‌లో చోటు కోసం పోటీపడనున్నాయి. భారీ స్కోర్లు, ఉత్కంఠభరిత ఛేజింగ్‌లు, స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనలు.. ఈ నెలను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి. ఐపీఎల్ 2026 విజేత ఎవరనేది 31న తెలుస్తుంది.
ఐపీఎల్ 2026 మే షెడ్యూల్:
మే 1 (శుక్రవారం): రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (జైపూర్)
మే 2 (శనివారం): చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (చెన్నై)
మే 3 (ఆదివారం): మధ్యాహ్నం 3:30: సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (హైదరాబాద్), రాత్రి 7:30: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (అహ్మదాబాద్)
మే 4 (సోమవారం): ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (ముంబై)
మే 5 (మంగళవారం): ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (ఢిల్లీ)
మే 6 (బుధవారం): సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (హైదరాబాద్)
మే 7 (గురువారం): లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (లక్నో)
మే 8 (శుక్రవారం): ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (ఢిల్లీ)
మే 9 (శనివారం): రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (జైపూర్)
మే 10 (ఆదివారం): మధ్యాహ్నం 3:30: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (చెన్నై), రాత్రి 7:30: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ (రాయ్‌పూర్)
మే 11 (సోమవారం): పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (ధర్మశాల)
మే 12 (మంగళవారం): గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (అహ్మదాబాద్)
మే 13 (బుధవారం): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్ (రాయ్‌పూర్)
మే 14 (గురువారం): పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ (ధర్మశాల)
మే 15 (శుక్రవారం): లక్నో సూపర్ జెయింట్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (లక్నో)
మే 16 (శనివారం): కోల్‌కతా నైట్ రైడర్స్ vs గుజరాత్ టైటాన్స్ (కోల్‌కతా)
మే 17 (ఆదివారం): మధ్యాహ్నం 3:30: పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ధర్మశాల), రాత్రి 7:30: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్ (ఢిల్లీ)
మే 18 (సోమవారం): చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (చెన్నై)
మే 19 (మంగళవారం): రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (జైపూర్)
మే 20 (బుధవారం): కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (కోల్‌కతా)
మే 21 (గురువారం): చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (చెన్నై)
మే 22 (శుక్రవారం): సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (హైదరాబాద్)
మే 23 (శనివారం): లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (లక్నో)
మే 24 (ఆదివారం): మధ్యాహ్నం 3:30: ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (ముంబై), రాత్రి 7:30: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (కోల్‌కతా)
మే 26 (మంగళవారం): క్వాలిఫైయర్ 1
మే 27 (బుధవారం): ఎలిమినేటర్
మే 29 (శుక్రవారం): క్వాలిఫైయర్ 2
మే 31 (ఆదివారం): ఫైనల్




