IPL 2026 Sixes: ఐపీఎల్ 2026లో సిక్సర్ల వర్షం.. టాప్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌.. 10వ స్థానంలో ఏ టీమ్ ఉందో తెలుసా?

SRH Top in IPL 2026 Sixes List: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026 సీజన్‌లో బౌలర్లపై బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నారు.

Rishvik
Published on: 11 May 2026 7:35 PM IST
IPL 2026 Sixes
X

IPL 2026 Sixes: ఐపీఎల్ 2026లో సిక్సర్ల వర్షం.. టాప్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌.. 10వ స్థానంలో ఏ టీమ్ ఉందో తెలుసా?

IPL 2026 Sixes: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026 సీజన్‌లో బౌలర్లపై బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. టాప్ పేసర్లు కూడా తేలిపోతున్నారంటే.. బ్యాటర్ల విధ్వసం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. బ్యాటర్లు విరుచుకుపడడంతో ఈ సీజన్‌లో భారీ స్కోర్లు, వరుసగా 200 ప్లస్ టోటల్స్ నమోదవుతున్నాయి. అంతేకాదు సిక్సర్ల వర్షం కూడా అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఈ సీజన్‌లో అత్యంత ప్రమాదకర బ్యాటింగ్ జట్టుగా పేరొందింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ హిట్టర్లు జట్టులో ఉండడంతో సిక్సర్ల జాబితాలో ఎస్‌ఆర్‌హెచ్‌ అగ్రస్థానంలో నిలిచింది.

ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు 135 సిక్సర్లు బాదింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హిట్టర్ల దూకుడుతో ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఎనిమిది సార్లు 200కు పైగా స్కోర్లు నమోదు చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌.. ఈ సీజన్‌లో అత్యంత ఎంటర్‌టైనింగ్ జట్టుగా మారింది. ఎస్‌ఆర్‌హెచ్‌ తర్వాత రెండో స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది. పంజాబ్ బ్యాటర్లు ఈ సీజన్‌లో 121 సిక్సర్లు కొట్టారు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ ఆగ్రెసివ్ క్రికెట్ ఆడుతూ ప్లేఆఫ్స్ రేసులో బలంగా నిలిచింది.

ఇక మూడో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 119 సిక్సర్లతో టాప్ జట్లకు గట్టి పోటీ ఇస్తోంది. విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య వంటి ప్లేయర్లు కీలక సమయంలో భారీ షాట్లతో జట్టుకు విజయాలు అందిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ 109 సిక్సర్లతో నాలుగో స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ 106 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉంది. ముంబై ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నప్పటికీ.. ఆ టీమ్ బ్యాటర్లు ఈ సీజన్‌లో భారీ హిట్టింగ్‌తో ఆకట్టుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ 96 సిక్సర్లతో ఆరో స్థానంలో నిలిచింది. యువ బ్యాటర్ ఉర్విల్ పటేల్ రాక తర్వాత సీఎస్‌కే బ్యాటింగ్ మరింత దూకుడుగా మారింది.

అత్యధిక సిక్సర్ల జాబితాలో లక్నో సూపర్ జెయింట్స్ 94 సిక్సర్లతో ఏడో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 86 సిక్సర్లతో ఎనిమిదో స్థానంలో ఉండగా.. గుజరాత్ టైటాన్స్ 80 సిక్సర్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ కేవలం 75 సిక్సర్లతో చివరి స్థానంలో ఉంది. ఈ గణాంకాలు చూస్తే.. ఈ సీజన్‌లో బ్యాటింగ్ ఆధిపత్యం ఎంతలా ఉందో స్పష్టంగా తెలుస్తోంది.

అత్యధిక సిక్సర్లు బాదిన టీమ్ లిస్ట్:

135 – సన్‌రైజర్స్ హైదరాబాద్

121 – పంజాబ్ కింగ్స్

119 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

109 – రాజస్థాన్ రాయల్స్

106 – ముంబై ఇండియన్స్

96 – చెన్నై సూపర్ కింగ్స్

94 – లక్నో సూపర్ జెయింట్స్

86 – ఢిల్లీ క్యాపిటల్స్

80 – గుజరాత్ టైటాన్స్

75 – కోల్‌కతా నైట్ రైడర్స్

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story