IPL 2026 Playoffs: ఈరోజు ఐపీఎల్‌లో మరో కీలక మ్యాచ్.. తేలనున్న ఆ టీమ్ భవితవ్యం.
IPL 2026 Playoffs: ఐపీఎల్ ప్లే ఆఫ్స్ పోటీ రోజురోజుకూ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. ఇప్పటికే కొన్ని జట్లు టోర్నీ నుంచి దాదాపు బయటకురాగా.. మరికొన్ని జట్లు చివరి వరకూ పోరాడుతున్నాయి.
IPL 2026 Playoffs
IPL 2026 Playoffs: ఐపీఎల్ ప్లే ఆఫ్స్ పోటీ రోజురోజుకూ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. ఇప్పటికే కొన్ని జట్లు టోర్నీ నుంచి దాదాపు బయటకురాగా.. మరికొన్ని జట్లు చివరి వరకూ పోరాడుతున్నాయి. ఆదివారం జరిగిన మ్యాచ్‌ల తర్వాత ముంబై, లక్నో అధికారికంగా ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయాయి. ఇప్పుడు అందరి దృష్టి ఇవాళ జరిగే కీలక పోరుపై పడింది.
ఢిల్లీకి ఇది చివరి అవకాశం లాంటి మ్యాచ్
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దిగువ స్థానాల్లో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించిన ఆ జట్టు ఎనిమిది పాయింట్లతో కష్టాల్లో పడింది. ఇవాళ పంబాజ్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్ ఢిల్లీకి కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఓటమి ఎదురైతే ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలకు పూర్తిగా తెరపడే అవకాశం ఉంది. గెలిచినా పరిస్థితి అంత సులభం కాదు.
గెలిచినా ఢిల్లీకి ఇంకా కఠిన సమీకరణాలే
పంజాబ్‌పై విజయం సాధించినా ఢిల్లీకి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కాలంటే మిగతా జట్ల ఫలితాలు కూడా అనుకూలంగా రావాలి. ప్రస్తుతం టాప్-4లో ఉన్న జట్లు మంచి స్థితిలో ఉండటంతో ఢిల్లీ ముందుకు రావడం చాలా కష్టంగా కనిపిస్తోంది. అంటే ఢిల్లీ భవితవ్యం ఇప్పుడు కేవలం తన చేతుల్లో మాత్రమే లేదు. ఇతర జట్ల ఓటములు, నెట్ రన్‌రేట్, పాయింట్ల సమీకరణాలపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది.
పంజాబ్‌కు టేబుల్ టాప్ ఛాన్స్
ఈ మ్యాచ్ పంజాబ్‌కు మాత్రం భారీ అవకాశాన్ని అందిస్తోంది. ప్రస్తుతం ఆ జట్టు 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీపై విజయం సాధిస్తే మరో రెండు పాయింట్లు జమై 15 పాయింట్లతో టేబుల్ టాప్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్‌లో పంజాబ్ మరింత దూకుడుగా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్లే ఆఫ్స్‌కు మరింత దగ్గరవ్వాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం ఆ జట్టుకు చాలా కీలకం.
ప్లే ఆఫ్స్ రేసులో ఇంకా ఎవరున్నారు?
ప్రస్తుతం చూస్తే టాప్-4లో ఉన్న జట్లకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని జట్లకు లెక్కల ప్రకారం చూస్తే ఇంకా అవకాశాలు మిగిలే ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్, గుజరాత్, పంజాబ్ జట్లు ప్రస్తుతం బలమైన స్థితిలో ఉన్నాయి.
ఇక చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ అనూహ్య ఫలితాలు వస్తే రేసులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కోల్‌కతా, ఢిల్లీ కూడా అద్భుతాలు జరిగితే మాత్రమే ముందుకు రావచ్చు.
కీలకం కానున్న మిగిలిన మ్యాచ్‌లు
ఇక నుంచి జరిగే ప్రతి మ్యాచ్ ప్లే ఆఫ్స్ లెక్కలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ముఖ్యంగా టాప్ జట్ల మధ్య జరగబోయే పోటీలు పాయింట్ల పట్టికలో భారీ మార్పులకు కారణం కావచ్చు. మిగిలిన లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి ఏ నాలుగు జట్లు ఫైనల్-4లో నిలుస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.




