క్లైమాక్స్‌కి చేరిన ఐపీఎల్‌.. ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ దూకుడు.. సీఎస్కే, రాజస్థాన్‌కు కఠిన పరీక్ష

IPL 2026 Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ పోరు రోజురోజుకూ ఉత్కంఠభరితంగా మారుతోంది. లీగ్ దశ ముగింపున‌కు దగ్గరపడుతున్న కొద్దీ ప్రతి మ్యాచ్ పాయింట్ల పట్టికను తారుమారు చేస్తోంది.

Mokshith
Published on: 12 May 2026 12:04 PM IST
ipl 2026
X

క్లైమాక్స్‌కి చేరిన ఐపీఎల్‌.. ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ దూకుడు.. సీఎస్కే, రాజస్థాన్‌కు కఠిన పరీక్ష

IPL 2026 Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ పోరు రోజురోజుకూ ఉత్కంఠభరితంగా మారుతోంది. లీగ్ దశ ముగింపున‌కు దగ్గరపడుతున్న కొద్దీ ప్రతి మ్యాచ్ పాయింట్ల పట్టికను తారుమారు చేస్తోంది. ఇప్పటికే కొన్ని జట్లు టాప్-4కు చేరువ కాగా, మరికొన్ని జట్లు ఆశలు నిలబెట్టుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టాప్‌లో మూడు జట్ల ఆధిపత్యం

ప్రస్తుతం బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌, గుజరాత్ జట్లు అత్యంత బలమైన స్థితిలో ఉన్నాయి. ఈ మూడు జట్లు 11 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు సాధించి ముందంజలో కొనసాగుతున్నాయి. మిగిలిన మ్యాచ్‌ల్లో ఒక్క విజ‌యం సాధించినా 16 పాయింట్ల మార్క్‌ను చేరుకుంటాయి. ఐపీఎల్ చరిత్రను పరిశీలిస్తే 16 పాయింట్లు సాధించిన జట్లు ఎక్కువసార్లు ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకున్నాయి.

ఈ కారణంగా ఈ మూడు ఫ్రాంచైజీలకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు 80 శాతం వరకు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నెట్ రన్‌రేట్ కూడా ఈ జట్లకు అనుకూలంగా ఉండటం మరో ప్లస్‌గా మారింది.

సీఎస్కే, రాజస్థాన్‌కు ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది.

ఇక చెన్నై, రాజ‌స్థాన్ జట్లు ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నాయి. ఈ రెండు జట్లు 11 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో మధ్యస్థానాల్లో నిలిచాయి. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు విజయాలు సాధించాల్సిన అవసరం ఏర్పడింది. సీఎస్కేకు ప్లేఆఫ్స్ అవకాశాలు సుమారు 42 శాతం వరకు ఉండగా, రాజస్థాన్‌కు 41 శాతం అవకాశాలే కనిపిస్తున్నాయి. ఒక మ్యాచ్‌లోనైనా ఓటమి ఎదురైతే పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది. అప్పుడు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

రాజస్థాన్ జట్టులో యువ ఆటగాడు సూర్య‌వంశి మంచి ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కొంత ఊరటనిస్తోంది. కానీ బౌలింగ్ విభాగం స్థిరంగా రాణించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఢిల్లీ విజయం.. పంజాబ్‌కు భారీ దెబ్బ

పంజాబ్ కింగ్స్ జట్టు కీలక సమయంలో తడబడింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ చేతిలో ఓటమి పాలవడంతో పంజాబ్ ప్లేఆఫ్స్ ప్రయాణం కాస్త కఠినంగా మారింది. ప్రస్తుతం పంజాబ్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అయితే ఇంకా ఆ జట్టుకు అవకాశాలు పూర్తిగా కోల్పోలేదు. సుమారు 62 శాతం అవకాశాలు కొనసాగుతున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.

మరోవైపు ఢిల్లీ, కోల్‌క‌తా జట్లకు లెక్క‌లప‌రంగా అవకాశాలు ఉన్నప్పటికీ అవి చాలా స్వల్పంగా ఉన్నాయి. ఇక ముంబై ఇండియ‌న్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లే భావిస్తున్నారు.

ప్లేఆఫ్స్‌కు 16 పాయింట్లే సేఫ్ జోన్

ఐపీఎల్ 10 జట్ల ఫార్మాట్‌లోకి మారిన తర్వాత 16 పాయింట్లు ప్లేఆఫ్స్‌కు కీలక సంఖ్యగా మారింది. గత కొన్ని సీజన్లలో నాలుగో స్థానంలో నిలిచిన జట్లు ఎక్కువగా 16 పాయింట్లతోనే అర్హత సాధించాయి. అయితే 2024 సీజన్‌లో మాత్రం నెట్ రన్‌రేట్ కారణంగా 14 పాయింట్లతో కూడా ఒక జట్టు ముందుకు వెళ్లిన ఉదాహరణ ఉంది. ఈసారి కూడా కొన్ని జట్లు సమాన పాయింట్లతో నిలిస్తే నెట్ రన్‌రేట్ నిర్ణాయకంగా మారే అవకాశం ఉంది. అందుకే ఇక ప్రతి జట్టు భారీ విజయాలపై దృష్టి పెట్టే పరిస్థితి కనిపిస్తోంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story