IPL: ఐపీఎల్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు.. తొలి మ్యాచ్‌లోనే ఆ ఘ‌న‌త సాధించిన తొలి ప్లేయ‌ర్

IPL: ఐపీఎల్ 2026 సీజన్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తరఫున ఆడుతున్న యువ బౌలర్ ప్రఫుల్ హింజ్ తన తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

Mokshith
Published on: 14 April 2026 5:15 PM IST
IPL
X

IPL

IPL: ఐపీఎల్ 2026 సీజన్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తరఫున ఆడుతున్న యువ బౌలర్ ప్రఫుల్ హింజ్ తన తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అరంగేట్రం ఓవర్‌లోనే మూడు వికెట్లు పడగొట్టి, ఇప్పటివరకు ఎవరూ సాధించని ఘనతను తన పేరిట నమోదు చేసుకున్నాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై పై ఈ సంచలన ప్రదర్శన హైదరాబాద్‌కు భారీ విజయం తీసుకొచ్చింది.

అరంగేట్రం ఓవర్‌లోనే మ్యాచ్ మలుపు

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియం వేదిక‌గా ప్రారంభ‌మైన మ్యాచ్‌లో రాజస్థాన్ ఇన్నింగ్స్ మొదలైన వెంటనే బంతి అందుకున్న ప్రఫుల్ హింగే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొదటి బంతికే యువ బ్యాటర్ వైభ‌వ్ సూర్య‌వంశీని ఔట్ చేసి షాక్ ఇచ్చాడు. మూడో బంతికి ధ్రువ్ జురెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓవర్ చివరి బంతికి డ్వైన్ ప్రీటోరియస్‌ను పెవిలియన్ పంపించాడు. కేవలం ఆరు బంతుల్లోనే 3 వికెట్లు తీసి, రాజస్థాన్ స్కోరు ఒక్క పరుగుకే 3 వికెట్లుగా పడిపోయింది. ఈ ఓవర్‌తో మ్యాచ్ దిశ పూర్తిగా మారిపోయింది.

నాగ్‌పూర్ నుంచి ఐపీఎల్ వెలుగులోకి

ప్రఫుల్ హింగే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించాడు. దేశీయ క్రికెట్‌లో విద‌ర్భ క్రికెట్ టీమ్ తరఫున అద్భుతంగా ఆడుతూ గుర్తింపు తెచ్చుకున్నాడు. 2024-25 సీజన్‌లో రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీల్లో అతని ప్రదర్శన కీలకం. ఎత్తుగా ఉండే హింగే వేగంతో పాటు మంచి బౌన్స్ కూడా సృష్టించగలడు. చెన్నైలోని ఎమ్ఆర్ఎఫ్ పేస్ ఫౌండేష‌న్‌లో శిక్షణ తీసుకున్నాడు. దీంతో పాటు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో కూడా ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమశిక్షణ, కఠిన శిక్షణ వల్లే అతను ఐపీఎల్ స్కౌట్స్ దృష్టిలోకి వచ్చాడు.

ఐపీఎల్ వేలంలో స‌న్‌రైజ‌ర్స్‌ అతన్ని రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ తొలి మ్యాచ్‌ల్లో అవకాశం రాలేదు. ఒక మ్యాచ్‌లో ఆడతాడనుకున్నా, చివరి నిమిషంలో బయటే ఉండాల్సి వచ్చింది. అయితే రాజస్థాన్‌పై వచ్చిన అవకాశం అతనికి టర్నింగ్ పాయింట్ అయ్యింది. సీనియర్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ స్థానంలో జట్టులోకి వచ్చి, తన ప్రతిభను అద్భుతంగా నిరూపించాడు. ఒకే ఓవర్‌తో మ్యాచ్‌ను తారుమారు చేసిన ప్రఫుల్ హింగే, ఈ సీజన్‌లో అత్యంత ఆసక్తికరమైన యువ ఆటగాడిగా నిలిచాడు. ఇకపై అతని ప్రదర్శనపై అందరి దృష్టి ఉండనుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story