IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 విన్నర్‌కు రూ.20 కోట్లు.. మిగతా టీమ్‌లకు ఎంత ప్రైజ్‌మనీ వస్తుందంటే?
IPL 2026 Prize Money Details Revealed. ఐపీఎల్ 2026 ఫైనల్లో గెలిచిన జట్టుకు కప్పుతో పాటు భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ కూడా దక్కనుంది.
IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 విన్నర్‌కు రూ.20 కోట్లు.. మిగతా టీమ్‌లకు ఎంత ప్రైజ్‌మనీ వస్తుందంటే?
IPL 2026 Prize Money: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. మరికొద్దిసేపట్లో అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), 2023 విన్నర్ గుజరాత్ టైటాన్స్ (జీటీ) ఐపీఎల్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ఫైనల్లో గెలిచిన జట్టుకు కప్పుతో పాటు భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ కూడా దక్కనుంది. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. ఐపీఎల్ 2026 ఫైనల్ నేపథ్యంలో టోర్నీ ప్రైజ్ మనీ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బీసీసీఐ వర్గాల ప్రకారం.. ఐపీఎల్ 2026 మొత్తం ప్రైజ్‌మనీ రూ.46.50 కోట్లు. ఫైనల్‌లో గెలిచిన టీమ్‌కు కప్పుతో పాటు రూ. 20 కోట్ల ప్రైజ్‌మనీ దక్కుతుంది. ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచే జట్టుకు రూ.13 కోట్లు అందుతాయి. ప్లేఆఫ్స్‌కు చేరిన మరో రెండు టీమ్‌లకు ప్రైజ్‌మనీ ఉంటుంది. క్వాలిఫయర్-2లో ఓడిన రాజస్థాన్ రాయల్స్‌కు రూ.7 కోట్లు దక్కనుండగా.. ఎలిమినేటర్‌లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రూ.6.50 కోట్లు దక్కుతాయి. ఇక పాయింట్ల పట్టికలో ఐదో స్థానం నుంచి పదో స్థానం వరకు ఉన్న జట్లకు ఎలాంటి ప్రైజ్‌మనీ ఉండదు.
ఐపీఎల్ 2026లో జట్లతో పాటు ఆటగాళ్లకూ వ్యక్తిగతంగా ప్రైజ్‌మనీ ఉంటుంది. ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ప్రత్యేక నగదు బహుమతులు అందించనున్నారు. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలతో పాటు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడికి తలా రూ.10 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నారు. ఒక పర్పుల్ క్యాప్ తప్ప మిగతా అవార్డులు అన్ని భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి దక్కనున్నాయి.
2008లో ఐపీఎల్ మొదటి సీజన్ ప్రారంభమైంది. అప్పుడు విజేతకు రూ.4.8 కోట్లు ప్రైజ్‌మనీ దక్కింది. 2009 సీజన్‌లోనూ ఇదే మొత్తం దక్కింది. 2010 నుంచి 2013 వరకు రూ.10 కోట్లు చొప్పున ప్రైజ్‌మనీని అందించారు. 2014, 2015లో రూ. 15 కోట్ల ప్రైజ్‌మనీ దక్కగా.. 2016 నుంచి 2019 వరకు రూ.20 కోట్లు ఇచ్చారు. కరోనా వైరస్ కారణంగా 2020లో ప్రైజ్‌మనీని రూ.10 కోట్లకు తగ్గించారు. 2021 నుంచి 2026 వరకూ రూ.20 కోట్ల చొప్పున ప్రైజ్‌మనీ దక్కుతోంది.
జట్ల వారీగా ప్రైజ్ మనీ:
ఛాంపియన్ – రూ/20 కోట్లు
రన్నరప్ – రూ.13 కోట్లు
మూడో స్థానం – రూ.7 కోట్లు
నాలుగో స్థానం – రూ.6.5 కోట్లు
వ్యక్తిగత అవార్డుల ప్రైజ్ మనీ:
ఆరెంజ్ క్యాప్ విన్నర్ – రూ.10 లక్షలు
పర్పుల్ క్యాప్ విన్నర్ – రూ.10 లక్షలు
మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ – రూ.10 లక్షలు
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ – రూ.10 లక్షలు
అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ – రూ.10 లక్షలు




