RR vs CSK: టాస్ గెలిచిన రాజస్థాన్.. భిన్న రంగు దుస్తుల్లో సంజు-జడ్డు, తుది జట్లు ఇవే!

RR vs CSK: ఐపీఎల్ 2026లో భాగంగా మరికొద్దిసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) జట్లు తలపడనున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 March 2026 7:40 PM IST
RR vs CSK: టాస్ గెలిచిన రాజస్థాన్.. భిన్న రంగు దుస్తుల్లో సంజు-జడ్డు, తుది జట్లు ఇవే!
X

RR vs CSK: టాస్ గెలిచిన రాజస్థాన్.. భిన్న రంగు దుస్తుల్లో సంజు-జడ్డు, తుది జట్లు ఇవే!

RR vs CSK IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా మరికొద్దిసేపట్లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), ఐపీఎల్ మొట్టమొదటి విజేత రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) జట్లు తలపడనున్నాయి. గౌహతిలోని బర్సపారా స్టేడియంలో ఆర్‌ఆర్, సీఎస్‌కే ఢీ కొట్టనున్నాయి. టాస్‌కు ముందు వర్షం పడింది. అవుట్‌ ఫీల్డ్ తడిగా ఉండటం వల్ల టాస్ కాస్త ఆలస్యమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి రాజస్థాన్‌ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. దాంతో చెన్నై ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

ఐపీఎల్‌ 2026లో చెన్నైకి గాయాల బెడద తప్పడం లేదు. రాజస్థాన్‌తో తొలి మ్యాచ్‌కు ముందు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఎంఎస్ ధోనీ రెండు వారాలు టోర్నీకి దూరం కాగా.. దక్షిణాఫ్రికా హిట్టర్‌ డెవాల్డ్‌ బ్రెవిస్‌ కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ప్రాక్టీస్‌ సమయంలో బ్రెవిస్‌కు పక్కటెముకల గాయమైందని చెన్నై కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ వెల్లడించాడు. ధోనీ మ్యాచ్ ఆడకపోవడంతో ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా రాజస్థాన్‌కు ఆడిన సంజు శాంసన్‌ చెన్నైకి.. చాలా ఏళ్లు చెన్నైకి ఆడిన రవీంద్ర జడేజా రాజస్థాన్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరినీ భిన్న రంగు దుస్తుల్లో ఫాన్స్ చూడబోతున్నారు.

తుది జట్లు:

రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైస్వాల్‌, వైభవ్‌ సూర్యవంశీ, రియాన్‌ పరాగ్‌ (కెప్టెన్‌), ధ్రువ్‌ జురేల్‌ (కీపర్‌), షిమ్రాన్ హెట్‌మెయర్‌, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్‌, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ.

చెన్నై సూపర్‌ కింగ్స్‌: సంజు శాంసన్‌ (కీపర్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌ (కెప్టెన్‌), ఆయుష్‌ మాత్రే, మాథ్యూ షార్ట్‌, శివమ్‌ దూబె, కార్తిక్‌ శర్మ, జెమీ ఓవర్టన్‌, నూర్‌ అహ్మద్‌, మ్యాట్‌ హెన్రీ, అన్షుల్‌ కాంబోజ్‌, ఖలీల్‌ అహ్మద్‌.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story