IPL 2026: అభిమానులకు బిగ్ అలర్ట్.. ఐపీఎల్ షెడ్యూల్‌లో భారీ మార్పు!

IPL 2026: విశాఖపట్నంలో నారీ శక్తి వందన్ సమ్మేళనం కార్యక్రమాన్ని వీక్షించిన పి.వి.ఎన్ మాధవ్.

Rishvik
Published on: 13 April 2026 8:00 PM IST
IPL 2026
X

IPL 2026: అభిమానులకు బిగ్ అలర్ట్.. ఐపీఎల్ షెడ్యూల్‌లో భారీ మార్పు!

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమానులకు బిగ్ అలర్ట్. ఐపీఎల్ 2026 షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ (జీటీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లను పరస్పరం మార్పిడి చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. భద్రతా, లాజిస్టికల్ కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 26న అహ్మదాబాద్‌లో మధ్యాహ్నం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ను చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంకు మార్చారు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. అదే విధంగా మే 21న చెన్నైలో జరగాల్సిన సీఎస్కే,

జీటీ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి మార్చారు. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ఆరంభం అవుతుంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఏప్రిల్ 26న మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భారీ జనసంచారం, భద్రతా సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నందున బీసీసీఐ ఈ మార్పులు చేసింది.

ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఎం.చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగింది. ఇప్పటివరకు మొత్తం 21 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రారంభంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ స్పష్టత లేకపోవడంతో.. బీసీసీఐ మొదటి దశలో కొన్ని మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసింది. అనంతరం ఎన్నికల తేదీలు ఖరారు కావడంతో మార్చి 26న పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది.

ప్లేఆఫ్స్, ఫైనల్ వేదికలను బీసీసీఐ ఇంకా ప్రకటించాల్సి ఉంది. బెంగళూరు గత సీజన్ విజేతగా నిలిచిన నేపథ్యంలో ఫైనల్‌ను చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ చివరి స్థానంలో ఉంది. ఐపీఎల్ 2026 మ్యాచ్‌లు మరింత ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. క్రికెట్ అభిమానులు వేసవిలో మ్యాచ్‌లను ఎంజాయ్ చేస్తున్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story