IPL VIP Ticket Prices: ఆకాశానికి అంటున్న ఐపీఎల్ టికెట్ల ధరలు.. చిన్నస్వామిలో ఒక్కోటి 65 వేలు!

IPL 2026 VIP ticket prices surge across stadiums. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో క్రికెట్ జోష్ తారా స్థాయికి చేరింది.

Rishvik
Published on: 2 May 2026 11:48 PM IST
IPL VIP Ticket Prices
X

IPL VIP Ticket Prices: ఆకాశానికి అంటున్న ఐపీఎల్ టికెట్ల ధరలు.. చిన్నస్వామిలో ఒక్కోటి 65 వేలు!

IPL VIP Ticket Prices: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో క్రికెట్ జోష్ తారా స్థాయికి చేరింది. లీగ్ దశ తుది అంకానికి చేరుకోవడంతో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్లే ఆఫ్స్ చేరేందుకు అన్ని టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఈ సీజన్లో మ్యాచ్‌ల ఉత్కంఠతో స్టేడియంలో ప్రత్యక్షంగా చూసే అభిమానులకు డబుల్ వినోదం అందుతోంది. అయితే ఐపీఎల్ 2026లో టికెట్స్ రేట్స్ భారీగా పెరిగాయి.ముఖ్యంగా అభిమానులకు ప్రత్యేకంగా . ముఖ్యంగా వీఐపీ టికెట్లకు భారీ డిమాండ్ ఉంది. వివిధ స్టేడియాల్లో టికెట్ల ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లకు వీఐపీ టికెట్ రూ.20,000 నుంచి రూ.65,000 వరకు ఉన్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లకు రూ.20,000 నుంచి రూ.25,000 వరకు ధరలు ఉన్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదనంలో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లకు వీఐపీ టికెట్లు రూ.15,000 నుంచి రూ.40,000 వరకు ఉన్నాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లకు రూ.12,500 నుంచి రూ.17,000 వరకు ధరలు ఉన్నాయి.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లకు రూ.10,000 నుంచి రూ.30,000 వరకు వీఐపీ టికెట్లు లభిస్తున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లకు రూ.10,000 నుంచి రూ.28,000 వరకు ఉన్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానంలో గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లకు రూ.9,000 నుంచి రూ.25,000 వరకు ధరలు ఉన్నాయి. లక్నోలోని ఎకనా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లకు రూ.9,000 నుంచి రూ.22,000 వరకు ఉన్నాయి.

జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లకు రూ.8,000 నుంచి రూ.22,000 వరకు వీఐపీ టికెట్స్ ధరలు ఉన్నాయి. ధర్మశాలలోని HPCA మైదానములో పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లకు రూ.8,000 నుంచి రూ.20,000 వరకు టికెట్లు లభిస్తున్నాయి.

మొత్తం మీద వీఐపీ టికెట్లు సామాన్య అభిమానులకు అందనంత ఎత్తుల్లో ఉన్నాయి. సెలబ్రిటీలకు మాత్రం లగ్జరీ అనుభవాన్ని అందిస్తున్నాయి. ప్రత్యేక సీటింగ్, ఫుడ్, ప్రీమియం వ్యూయింగ్ వంటి సౌకర్యాలతో ఈ టికెట్లు అత్యంత డిమాండ్‌లో ఉన్నాయి. అయితే ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. తమ ఫేవరెట్ టీమ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి సెలెబ్రిటీలు ఏమాత్రం వెనుకాడటం లేదు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story