IPL: అభిమానుల ఎదురు చూపులకు ఫుల్స్టాప్ పడనుందా? ఈరోజైనా ధోని వస్తాడా.?
IPL: ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు మాత్రం ఓ లోటు వెంటాడుతోంది.
IPL: అభిమానుల ఎదురు చూపులకు ఫుల్స్టాప్ పడనుందా? ఈరోజైనా ధోని వస్తాడా.?
IPL: ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు మాత్రం ఓ లోటు వెంటాడుతోంది. ముఖ్యంగా ధోనీ ఫ్యాన్స్‌కు ప్రతీ మ్యాచ్‌లో నిరాశే మిగులుతుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ధోని ఆడకపోవడం ఇందుకు కారణం.
గుజరాత్ మ్యాచ్‌పై ఆశలు
ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ చెపాక్ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే అభిమానులందరి దృష్టి ఒకే ప్రశ్నపై ఉంది. ధోని ఈ రోజు ఆడతాడా? లేదా.?
ఇప్పటివరకు ధోని ఎందుకు కనిపించలేదు?
ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటికే సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. కానీ ధోని ఇంకా ఈ సీజన్లో మైదానంలో కనిపించలేదు. దీంతో అభిమానుల్లో ఆందోళన, ఆసక్తి రెండూ పెరిగాయి. ముఖ్యంగా ప్రతి మ్యాచ్ ముందు “ఈసారి ధోని వస్తాడా?” అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది.
కోచ్ క్లారిటీ
చెన్నై జట్టు కోచ్ మైఖేల్ హస్సీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ధోని పూర్తిగా ఫిట్‌గా లేడు. అతను బ్యాట్స్‌మన్‌గా మాత్రమే తిరిగి వచ్చే అవకాశం ఉంది. వికెట్‌కీపర్‌గా ఆడే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఇంకా ఫిట్నెస్ మెరుగుపరుచుకుంటున్నాడని, 100% సిద్ధంగా అయిన తర్వాతే మైదానంలోకి వస్తాడని చెప్పారు. అయితే త్వరలోనే ఆయన రీఎంట్రీ ఉండొచ్చని సంకేతాలు ఇచ్చారు.
ప్రాక్టీస్ వీడియోలు వచ్చాయి.. కానీ అధికారిక ప్రకటన లేదు
చెన్నై జట్టు ధోని ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను విడుదల చేసింది. అవి అభిమానుల్లో ఆశలు పెంచినా, ఈ రోజు మ్యాచ్‌లో ఆడతాడని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటివరకు వచ్చిన సమాచారాన్ని చూస్తే.. ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.
మొత్తం మీద అభిమానులు ధోని మైదానంలోకి రావాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఫిట్నెస్ పూర్తిగా సిద్ధంగా లేకపోవడంతో ఇంకా కొంత సమయం పడే అవకాశం ఉంది. కానీ ఒకసారి రీఎంట్రీ ఇచ్చాక మాత్రం అభిమానులకు మళ్లీ పండగే అని చెప్పొచ్చు.




