IPL: రూ. 18 కోట్ల అర్ష్‌దీప్‌కు బదులు హార్దిక్.. MI, PBKS మధ్య బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్?

IPL: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య PBKSకు ట్రేడ్ కావడం దాదాపు ఖాయమైనట్లు క్రీడావర్గాలు తెలిపాయి.

Ravi
By Ravi
Published on: 3 Nov 2026 6:43 PM IST
IPL
X

IPL: రూ. 18 కోట్ల అర్ష్‌దీప్‌కు బదులు హార్దిక్.. MI, PBKS మధ్య బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్?

IPL: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య PBKSకు ట్రేడ్ కావడం దాదాపు ఖాయమైనట్లు క్రీడావర్గాలు తెలిపాయి. ముంబై నుంచి హార్దిక్ ఆ జట్టుకు వెళ్లనుండగా, పంజాబ్ స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ MIలోకి వస్తారని పేర్కొన్నాయి. అటు యంగ్ బ్యాటర్ విష్ణు వినోద్ కూడా పంజాబ్ నుంచి ముంబైకి వెళ్లనున్నట్లు తెలిసాయి. ఫ్రాంచైజీతో విభేదాల కారణంగా హార్దిక్ MIని వీడతారని కొంతకాలంగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.

రిపోర్ట్ ప్రకారం ఈ డీల్ కోసం ముంబై సీనియర్ అధికారి మొదట పంజాబ్‌ను సంప్రదించారు. రికీ పాంటింగ్ కోచింగ్‌లోని పంజాబ్ అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ కోసం చూస్తూ ఈ ప్రతిపాదనకు అంగీకరించింది. MI ఈ ట్రేడ్ కోసం కనీసం మూడు జట్లతో చర్చలు జరిపినట్లు సమాచారం. అర్ష్‌దీప్ పంజాబ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. 2025 వేలంలో పంజాబ్ రైట్ టు మ్యాచ్ కార్డుతో ఆయనను రూ. 18 కోట్లకు నిలబెట్టుకుంది.

అర్ష్‌దీప్ వెళ్తే పంజాబ్ మరో లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌ను తీసుకునే అవకాశం ఉంది. హార్దిక్ 2024 తర్వాత ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ చేయలేదు. రిటెన్షన్ గడువు నవంబర్ 17తో ముగియనుంది. ఈ వారంలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ ట్రేడ్‌ను ఇప్పటివరకు MI, PBKS లేదా IPL పాలకమండలి అధికారికంగా ధ్రువీకరించలేదు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.