IPL: మినీ వేలానికి 1,220 మంది.. 66 స్లాట్లకే పోటీ.. ఏ జట్టు వద్ద ఎంత పర్స్ ఉందంటే!
IPL: డిసెంబర్ 16న గోవాలో జరిగే IPL మినీ వేలానికి 1,220 మంది నమోదు చేసుకున్నారు. 66 స్లాట్లే ఖాళీ ఉన్నాయి.
IPL: మినీ వేలానికి 1,220 మంది.. 66 స్లాట్లకే పోటీ.. ఏ జట్టు వద్ద ఎంత పర్స్ ఉందంటే!
IPL: డిసెంబర్ 16న గోవాలో జరిగే మినీ వేలానికి 1,220 మంది ప్లేయర్లు నమోదు చేసుకున్నట్లు IPL వెల్లడించింది. అత్యధికంగా MI, DC 9 మందిని, KKR 8 మందిని, LSG, SRH ఏడుగురిని, CSK, PBKS, RR ఆరుగురిని, RCB ఐదుగురిని, GT ముగ్గురిని కొనేందుకు అవకాశం ఉంది. ఓవర్సీస్ ప్లేయర్ల కేటగిరీలో ఆస్ట్రేలియా నుంచి 53 మంది నమోదు చేసుకున్నారు.
మొత్తం 1,220 మందిలో 939 మంది భారత ఆటగాళ్లు, 281 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. విదేశీయులు 17 దేశాలకు చెందినవారు. వీరిలో 14 మంది క్యాప్డ్ భారత ఆటగాళ్లు, 170 మంది క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు, 42 మంది అసోసియేట్ దేశాల ఆటగాళ్లు ఉన్నారు.
ఐపీఎల్ అనుభవం ఉన్న 127 మంది అన్క్యాప్డ్ భారత ఆటగాళ్లు, 798 మంది ఇతర అన్క్యాప్డ్ భారత ఆటగాళ్లు, 69 మంది అన్క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు కూడా జాబితాలో ఉన్నారు. పది ఫ్రాంచైజీలు ఇప్పటికే 184 మందిని అట్టిపెట్టుకున్నాయి లేదా ట్రేడింగ్ ద్వారా తీసుకున్నాయి. వీరిలో 55 మంది విదేశీయులు.
మొత్తం 66 స్లాట్లలో 25 విదేశీ ఆటగాళ్లకు కేటాయించారు. ఫ్రాంచైజీల వద్ద కలిపి రూ. 295.60 కోట్ల పర్స్ మిగిలి ఉంది. LSG వద్ద అత్యధికంగా రూ. 47.45 కోట్లు ఉన్నాయి. తర్వాత KKR రూ. 41.65 కోట్లు, SRH రూ. 40.15 కోట్లు, DC రూ. 39.50 కోట్లు, MI రూ. 30.25 కోట్లు, CSK రూ. 28.05 కోట్లు, RR రూ. 27.05 కోట్లు, PBKS రూ. 18.60 కోట్లతో ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ RCB వద్ద రూ. 14.15 కోట్లు, GT వద్ద కేవలం రూ. 8.75 కోట్లు మాత్రమే ఉన్నాయి.
విదేశీ స్లాట్లలో DCకి అత్యధికంగా 4 ఉన్నాయి. RCBకి 1 మాత్రమే మిగిలింది. ప్రస్తుత మూడేళ్ల సైకిల్లో ఇదే చివరి మినీ వేలం. గత ఏడాది డిసెంబర్ 16న అబుదాబిలో వేలం జరిగింది. నమోదైన 1,220 మందిలో ఎవరు వేలంలో పాల్గొంటారో తేల్చే తుది జాబితా, ఆటగాళ్ల సెట్లను డిసెంబర్ 4న విడుదల చేయనున్నారు.




