Hardik Pandya: ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా షాక్.. ఈ టీంలోకి ఎంట్రీ!

Hardik Pandya: ఐపీఎల్ రాబోయే సీజన్‌కు ముందు భారీ ప్లేయర్ మార్పిడి.

Gagan kumar
Published on: 8 Nov 2026 11:59 AM IST
Hardik Pandya
X

Hardik Pandya: ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా షాక్.. ఈ టీంలోకి ఎంట్రీ!

Arshdeep Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాబోయే సీజన్‌కు ముందు క్రికెట్ వర్గాల్లో ఒక భారీ సంచలన వార్త వైరల్ అవుతోంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పెద్ద ప్లేయర్ మార్పిడి దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ నావను నడిపించిన స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పంజాబ్ గూటికి చేరుతుండగా, పంజాబ్ కీలక డెత్ ఓవర్ల స్పెషలిస్ట్, లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించేందుకు మార్గం సుగమమైంది.

గుజరాత్ టైటాన్స్ నుంచి తిరిగి ముంబై ఇండియన్స్‌కు వచ్చి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత హార్దిక్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. మైదానంలోనూ, బయటా ఆశించిన స్థాయిలో సత్ఫలితాలు రాకపోవడంతో ప్రశాంతమైన వాతావరణంలో తన మార్క్ ఆల్ రౌండ్ కేపాబిలిటీని మళ్లీ నిరూపించుకోవాలని హార్దిక్ భావిస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో లేదా పంజాబ్ మేనేజ్‌మెంట్‌లో ప్రధాన ఆల్ రౌండర్‌గా కీలక పాత్ర పోషించేందుకు అతను సిద్ధమయ్యాడు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా మరొక ప్రపంచ స్థాయి ఇండియన్ పేసర్ అవసరం తీవ్రంగా ఉంది.

అర్ష్‌దీప్ సింగ్ రాకతో ముంబై డెత్ ఓవర్ల బౌలింగ్ ఎటాక్ లీగ్‌లోనే అత్యంత ప్రమాదకరంగా మారనుంది. రెండు ఫ్రాంచైజీల మధ్య ఈ స్వాప్ డీల్‌పై ఒప్పందం పూర్తయినట్లు ఐపీఎల్ వర్గాలు ధ్రువీకరించాయి. ఇండియన్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ నుంచి అధికారిక ఆమోదముద్ర పడటమే ఆలస్యం. ఐపీఎల్ వేలానికి ముందు చోటుచేసుకుంటున్న ఈ భారీ మార్పు రెండు జట్ల వ్యూహాలను పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది. అభిమానులు ఈ క్రేజీ ట్రేడ్‌పై అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.