Hardik Pandya: హార్దిక్ మాకొద్దు బాబోయ్..తేల్చి చెప్పిన ఈ రెండు జట్లు

Hardik Pandya: హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌ను వీడటం ఖాయమైందా? ధోనీ సూచనతో చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు చేపట్టబోతున్నారా?

Naresh.k
Published on: 2 July 2026 8:09 AM IST
Hardik Pandya
X

Hardik Pandya: హార్దిక్ మాకొద్దు బాబోయ్..తేల్చి చెప్పిన ఈ రెండు జట్లు

Hardik Pandya: ఐపీఎల్ క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. కానీ, ఇప్పుడు వినిపిస్తున్న ఒక వార్త మాత్రం క్రికెట్ అభిమానుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టుతో బంధాన్ని తెంచుకోవడం దాదాపు ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఐపీఎల్ వచ్చే సీజన్ వేలానికి ముందే ఈ పెను మార్పు చోటు చేసుకోబోతోందని క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది.

గత సీజన్ ముగిసినప్పటి నుంచే హార్దిక్ ముంబై ఫ్రాంచైజీని వీడుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై యాజమాన్యం అధికారికంగా స్పందించక పోయినప్పటికీ, లోపల జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆయన జట్టు మారడాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఒక స్టార్ ఆల్‌రౌండర్‌గా, మ్యాచ్ విన్నర్‌గా, అంతకుమించి జట్టును ముందుండి నడిపించగల కెప్టెన్‌గా హార్దిక్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. అందుకే ఐపీఎల్‌లోని మొత్తం 10 ఫ్రాంచైజీలలో దాదాపు 7 జట్లు ఆయనను దక్కించుకోవడానికి తెరవెనుక వ్యూహాలు రచిస్తున్నాయి.

హార్దిక్ పాండ్యాను సొంతం చేసుకునేందుకు గట్టి పోటీ నెలకొన్నప్పటికీ, రెండు ప్రధాన జట్లు మాత్రం ఈ రేసు నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు తెలుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలు హార్దిక్‌ను తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. మొదట్లో బెంగళూరు రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, తాజా నివేదికల ప్రకారం వారు వెనక్కి తగ్గారు. అటు హైదరాబాద్ సైతం తమ ప్రస్తుత జట్టు సమతుల్యతను దెబ్బతీసే ఉద్దేశం లేకపోవడంతో హార్దిక్ వైపు చూడటం లేదని సమాచారం.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో అత్యంత ఆసక్తికరమైన మలుపు ఏమిటంటే.. చెన్నై సూపర్ కింగ్స్ ఎంట్రీ ఇవ్వడం. గత వారం వరకు చెన్నైకి హార్దిక్‌ను తీసుకునే ఉద్దేశం లేదనే ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. మహేంద్ర సింగ్ ధోనీతో హార్దిక్ పాండ్యాకు ఉన్న అత్యంత సన్నిహిత సంబంధాలే ఇందుకు ప్రధాన కారణమని టాక్. ధోనీ సూచనల మేరకే చెన్నై ఫ్రాంచైజీ హార్దిక్ కోసం గట్టిగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.

ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో చెన్నై గత రెండు సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. కనీసం ప్లేఆఫ్స్ చేరడంలో కూడా విఫలమైంది. ఈ నేపథ్యంలో జట్టుకు భవిష్యత్తులో ఒక బలమైన, అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలని సీఎస్‌కే యాజమాన్యం గట్టిగా భావిస్తోంది. గతంలో గుజరాత్ టైటాన్స్ జట్టును నడిపించి, మొదటి సీజన్ లోనే ఐపీఎల్ ట్రోఫీ అందించిన అద్భుతమైన కెప్టెన్సీ రికార్డు హార్దిక్ సొంతం. కాబట్టి, ధోనీ తర్వాత చెన్నై వారసత్వాన్ని అందుకోవడానికి హార్దిక్ అయితేనే సరైన న్యాయం చేయగలడని ఫ్రాంచైజీ నమ్ముతోంది.

ఒకవేళ చెన్నై కాకపోతే హార్దిక్ తదుపరి ప్రయాణం ఎటువైపు సాగుతుందనేది మరో ఉత్కంఠ. కోల్‌కతా నైట్ రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ లాంటి బలమైన జట్లు కూడా హార్దిక్ కోసం గాలం వేస్తున్నాయి. అక్కడ చేరి సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తారా? లేక చెన్నై పసుపు జెర్సీని ధరించి ధోనీ నీడలో సరికొత్త సారథిగా అవతరిస్తారా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఏదేమైనా, ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే క్రికెట్ ప్రియులకు ఒక భారీ హై-వోల్టేజ్ డ్రామా గ్యారెంటీ అనిపిస్తోంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story