Vaibhav Sooryavanshi: సెల్ఫీ కావాలంటే ₹100 ఇవ్వాలి! చిన్నారులతో వైభవ్ సూర్యవంశీ క్యూట్ ప్రాంక్.. వీడియో వైరల్!
Vaibhav Sooryavanshi: రాజస్థాన్ రాయల్స్ స్టార్ వైభవ్ సూర్యవంశీ విమానాశ్రయంలో ఇద్దరు చిన్నారులతో చేసిన సరదా ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెల్ఫీ కోసం డబ్బులు అడిగిన వైభవ్, ఆ తర్వాత పిల్లలతో ఫోటోలు దిగిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.
Vaibhav Sooryavanshi: సెల్ఫీ కావాలంటే ₹100 ఇవ్వాలి! చిన్నారులతో వైభవ్ సూర్యవంశీ క్యూట్ ప్రాంక్.. వీడియో వైరల్!
Vaibhav Sooryavanshi: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో తన సంచలన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ, తాజాగా ఒక సరదా సంఘటనతో వార్తల్లో నిలిచాడు. విమానాశ్రయంలో ఇద్దరు చిన్నారులు సెల్ఫీ అడగ్గా, అతను చేసిన 'ప్రాంక్' నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
విమానాశ్రయంలో వేచి ఉన్న సూర్యవంశీ దగ్గరకు ఇద్దరు పిల్లలు వచ్చి సెల్ఫీ కావాలని అడిగారు. అప్పుడు వైభవ్ చాలా సీరియస్‌గా ముఖం పెట్టి.. "ఫోటో కావాలంటే నేను డబ్బులు తీసుకుంటా.. ఒక్కో ఫొటోకు ₹100 ఇవ్వాలి" అని అన్నాడు. ఆ చిన్నారి క్రికెటర్ నిజంగానే డబ్బులు అడుగుతున్నాడని నమ్మిన ఆ పిల్లలు.. "అయితే మా ఇద్దరికీ కలిపి ₹200 తీసుకోండి" అంటూ చాలా అమాయకంగా బదులిచ్చారు.
పిల్లల అమాయకత్వానికి ముగ్ధుడైన వైభవ్, వెంటనే నవ్వుతూ అదంతా జోక్ అని చెప్పి వారిని దగ్గరకు తీసుకున్నాడు. "కెమెరా వైపు చూడండి" అని క్యూట్‌గా పోజులిచ్చి వారితో ఫోటోలు దిగాడు. ఈ వీడియో చూసిన అభిమానులు "మైదానంలో డైనమేట్.. బయట మాత్రం చాలా సింపుల్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ 15 ఏళ్ల కుర్రాడు రికార్డులను తిరగరాస్తున్నాడు. ఇటీవలే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే శతకం బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుత సీజన్‌లో 8 ఇన్నింగ్స్‌లలో 357 పరుగులు సాధించి, 234.87 అద్భుత స్ట్రైక్ రేట్‌తో ఆరెంజ్ క్యాప్ రేసులో కొనసాగుతున్నాడు. ఈ చిన్న వయసులోనే ఇంతటి పరిణతితో ఆడుతున్న వైభవ్, భవిష్యత్తులో భారత క్రికెట్‌కు మరో సూపర్ స్టార్‌గా మారడం ఖాయమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.




