Ira Aery: ఎల్లీస్ పెర్రీ, స్మృతి మంధానకు కాదు.. ఈ 17 ఏళ్ల క్రికెటర్‌ అందంకు ఫిదా అవుతున్న ఫాన్స్!

Ira Aery: 17 ఏళ్ల యువ ఆల్‌రౌండర్ 'ఇరా ఏరీ' తన అద్భుతమైన ఆటతీరుతో అభిమానుల మనసులను దోచుకుంటోంది.

Rishvik
Published on: 18 Jun 2026 7:34 PM IST
Ira Aery
X

Ira Aery: ఎల్లీస్ పెర్రీ, స్మృతి మంధానకు కాదు.. ఈ 17 ఏళ్ల క్రికెటర్‌ అందంకు ఫిదా అవుతున్న ఫాన్స్!

Ira Aery: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో ఓ కొత్త తార దూసుకొస్తోంది. భారత సంతతికి చెందిన 17 ఏళ్ల యువ ఆల్‌రౌండర్ 'ఇరా ఏరీ' తన అద్భుతమైన ఆటతీరుతోనే కాకుండా.. మైమరిపించే అందంతోనూ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల మనసులను దోచుకుంటోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా అండర్-19 మహిళల జట్టులో కీలక ఆటగాడిగా రాణిస్తున్న ఇరా.. భవిష్యత్తు స్టార్‌గా క్రికెట్ విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటోంది.

భారతీయ మూలాలు:

ఇరా ఏరీ 2009 ఫిబ్రవరి 25న ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం హైడల్‌బర్గ్‌లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు భారతదేశం నుంచి వెళ్లి అక్కడ స్థిరపడినవారే. చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న ఇరా.. స్థానిక క్లబ్‌లలో ఆడుతూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. విక్టోరియా వెస్ట్రన్ రీజియన్ జూనియర్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. పాఠశాల స్థాయి టోర్నమెంట్లలో అసాధారణ ప్రదర్శనతో కోచ్‌ల దృష్టిని ఆకర్షించింది. క్రమశిక్షణ, ఫిట్‌నెస్, ఆటపై ఉన్న అంకితభావంతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 జట్టులో స్థానం సంపాదించుకుంది.

ముక్కోణపు సిరీస్‌లో వికెట్ల వేట:

ఇటీవల ఇంగ్లాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మహిళల అండర్-19 ముక్కోణపు సిరీస్‌లో ఇరా ఏరీ బంతితో రాణించింది. ఈ టోర్నమెంట్‌లో నిలకడగా రాణిస్తూ 13 వికెట్లు పడగొట్టింది. దాంతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అగ్రస్థానంలో నిలిచింది. ఒత్తిడి సమయాల్లోనూ సంయమనం కోల్పోకుండా వికెట్లు తీయగల ఆమె నైపుణ్యం ఆస్ట్రేలియా సీనియర్ జట్టు సెలెక్టర్లను ఆకట్టుకుంది. ఆల్‌రౌండర్ ప్రతిభ ఉన్న ఇరా.. ఇదే ఫామ్ కొనసాగిస్తే త్వరలోనే ఆస్ట్రేలియా సీనియర్ మహిళల జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

సోషల్ మీడియాలో క్రష్:

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఇరా ఏరీ పేరు మారుమోగిపోతోంది. ఆమె ఆట తీరుతో పాటు అందం, ఫిట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కొందరైతే ఆమెను ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీతో పోలుస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు భారత అందం స్మృతి మంధానతో పోల్చుతున్నారు. పెర్రీ, స్మృతిల కంటే సూపర్ అంటున్నారు. క్రికెట్ ప్రపంచపు సరికొత్త క్రష్ గా నెటిజెన్స్ అభివర్ణిస్తున్నారు.

కీలక పిల్లర్‌గా ఎదగడం ఖాయం:

కేవలం గ్లామర్‌తోనే కాకుండా, మైదానంలో తనదైన ప్రతిభతో ఇరా ఏరీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఈ భారత సంతతి అమ్మాయి.. భవిష్యత్తులో ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌కు ఒక కీలక పిల్లర్‌గా ఎదగడం ఖాయం. ఇరా కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.


Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story