Mohammed Siraj: ఆ హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి ఫిక్స్ ..? జూన్‌లోనే ముహూర్తం
Mohammed Siraj: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్, నటి మాహిరా శర్మల పెళ్లి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం
Mohammed Siraj : ఆ హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి ఫిక్స్ ..? జూన్‌లోనే ముహూర్తం
Mahira Sharma: క్రికెట్ రంగానికి, సినీ రంగానికి ఉన్న లింకులు ఈనాటివి కావు. విరాట్ కోహ్లీ-అనుష్కా శర్మ, కేఎల్ రాహుల్-అతియా శెట్టి.. ఇలా ఎందరో తారలు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. తాజాగా ఈ లిస్ట్ లోకి హైదరాబాద్ కుర్రాడు, టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా చేరబోతున్నాడంటూ గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ఒక వార్త దావానలంలా వ్యాపిస్తోంది. ప్రముఖ మోడల్, నటి మాహిరా శర్మతో సిరాజ్ ప్రేమలో ఉన్నాడని, వీరిద్దరూ జూన్ చివరి వారంలో వివాహం చేసుకోబోతున్నారంటూ ఒక ఎక్స్ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఐపీఎల్ సమయంలోనే అర్ష్‌దీప్ సింగ్ పేరు నటి సమ్రీన్ కౌర్‌తో ముడిపడగా.. ఇప్పుడు సిరాజ్ పెళ్లి వార్త కూడా రావడంతో ఫ్యాన్స్ అంతా ఇది నిజమేనని నమ్ముతున్నారు.
ఈ పెళ్లి రూమర్లు ఇంతలా వైరల్ కావడానికి బీసీసీఐ తీసుకున్న ఒక నిర్ణయం కూడా కారణమైంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు ప్రకటించిన భారత టీ20 స్క్వాడ్‌లో మొదట సిరాజ్ పేరు ఉంది. కానీ, ఆ తర్వాత అతని స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను ఎంపిక చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. వరుసగా క్రికెట్ ఆడుతుండటం వల్ల సిరాజ్ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని బోర్డు మెడికల్ టీమ్ స్పష్టం చేసినప్పటికీ.. నెటిజన్లు మాత్రం ఊరుకోలేదు. సిరాజ్ తన పెళ్లి పనుల కోసమే ఈ సిరీస్ నుండి తప్పుకున్నాడంటూ సోషల్ మీడియాలో కథనాలు అల్లేశారు.
జూన్ చివరి వారంలో ఇద్దరూ ఒకటి కాబోతున్నారు అంటూ స్పోర్ట్స్ అనలిస్ట్ ముఫాదల్ వోహ్రా పేరును పోలిన ఒక ఫేక్ అకౌంట్ నుంచి వచ్చిన ట్వీట్ కారణంగానే ఈ గందరగోళం మొదలైంది. ఈ వైరల్ పోస్ట్‌లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. సిరాజ్, మాహిరా శర్మల వివాహం జరగబోతోందనే వార్త పూర్తిగా అబద్ధం. వీరిద్దరికీ జూన్ నెలలో ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేవు. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం సృష్టించిన ఫేక్ ట్వీట్ అని తేలిపోయింది.
నిజానికి సిరాజ్, మాహిరా శర్మల మధ్య ఎఫైర్ ఉందంటూ గతంలో కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. ముంబైలోని ఒకే కాఫీ షాప్‌లో వీరు కనిపించడంతో నెటిజన్లు రకరకాల కథనాలు రాశారు. అయితే ఆ సమయంలోనే మాహిరా శర్మ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తాను ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేనని, తన పేరును అనవసరంగా క్రికెటర్‌తో ముడిపెట్టవద్దని చాలా స్పష్టంగా చెప్పింది. అటు సిరాజ్ కూడా ఇటువంటి రూమర్లను ఎప్పుడూ లైట్ తీసుకుంటాడే తప్ప పట్టించుకోడు.
మహ్మద్ సిరాజ్ గత కొన్ని నెలలుగా తీవ్రమైన క్రికెట్ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న సిరాజ్, ఆ తర్వాత ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున అన్ని మ్యాచ్‌లు ఆడాడు. ఆ వెంటనే అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లోనూ శ్రమించాడు. ఈ సుదీర్ఘ సీజన్ కారణంగా అతనికి కాస్త అలసట రాకుండా ముందస్తు జాగ్రత్తగా మాత్రమే బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. ఈ గ్యాప్‌లో మన హైదరాబాదీ ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నాడే తప్ప పెళ్లి పీటలు ఎక్కడం లేదు. కాబట్టి ఈ వైరల్ వార్తలను నమ్మాల్సిన అవసరం లేదు.




