Ishan Kishan: భారత చరిత్రలో ఇషాన్ కిషన్‌కు ప్రత్యేక స్థానం.. ఏకంగా 'కింగ్' కోహ్లీ సరసన!
Ishan Kishan: Ishan Kishan No.1 spot in the ICC T20I batting Rankings. ఇషాన్ కిషన్ ఐసీసీ తాజా టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
Ishan Kishan: భారత చరిత్రలో ఇషాన్ కిషన్‌కు ప్రత్యేక స్థానం.. ఏకంగా 'కింగ్' కోహ్లీ సరసన!
Ishan Kishan: భారత వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఐసీసీ తాజా టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దాదాపు ఏడాది పాటు నంబర్-1గా కొనసాగిన తన సహచరుడు అభిషేక్ శర్మను వెనక్కి నెట్టి.. ప్రపంచ నంబర్-1 టీ20 బ్యాటర్‌గా నిలిచాడు. బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ అనంతరం విడుదలైన తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇషాన్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ రేటింగ్ పాయింట్ల (876)ను సాధించి అగ్రస్థానానికి చేరుకున్నాడు.
టీ20 వరల్డ్‌కప్ ప్రదర్శనతో అగ్రస్థానానికి:
ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ 2026లో ఇషాన్ కిషన్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. టోర్నీలో 317 పరుగులు చేసిన ఇషాన్.. దాదాపు 200 స్ట్రైక్‌రేట్తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌పై ఆడిన మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అదే ప్రదర్శన అతడిని ఇప్పుడు ప్రపంచ నంబర్-1 బ్యాటర్‌గా నిలబెట్టింది.
అభిషేక్ రెండో స్థానానికి:
దాదాపు 12 నెలల పాటు నంబర్-1 స్థానాన్ని నిలబెట్టుకున్న అభిషేక్ శర్మ ఇప్పుడు కేవలం ఏడు రేటింగ్ పాయింట్ల (869) తేడాతో రెండో స్థానానికి పడిపోయాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో నంబర్-1 బ్యాటర్‌గా నిలిచిన భారత ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకున్న టీమిండియా క్రికెటర్‌గా ఇషాన్ కిషన్ రికార్డుల్లో నిలిచాడు. ఒకప్పుడు జట్టు నుంచి తప్పించబడిన ఇషాన్.. తిరిగి వచ్చి నంబర్-1 స్థానాన్ని చేరుకోవడం విశేషం.
టీ20 ర్యాంకింగ్స్‌లో మార్పులు:
ఐర్లాండ్ కెప్టెన్ లోర్కన్ టక్కర్ నాలుగు స్థానాలు ఎగబాకి 77వ స్థానానికి చేరుకోగా.. రాస్ అడైర్ ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని 84వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో ఐర్లాండ్ పేసర్ మాథ్యూ హంఫ్రీస్ నాలుగు వికెట్ల ప్రదర్శనతో ఒక స్థానం మెరుగుపరుచుకుని 25వ ర్యాంక్‌కు చేరి కెరీర్ బెస్ట్ రేటింగ్ సాధించాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో భారత ఆటగాడు శివమ్ దూబే మూడు స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరుకోగా.. ఐర్లాండ్‌కు చెందిన గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్ వరుసగా 24వ, 38వ స్థానాల్లో నిలిచారు.
టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ట్రావిస్ హెడ్ నంబర్-1:
టెస్ట్ క్రికెట్‌లో కూడా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ తన కెరీర్‌లో తొలిసారి ప్రపంచ నంబర్-1 టెస్ట్ బ్యాటర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్, జో రూట్ న్యూజిలాండ్‌తో జరిగిన నాటింగ్‌హామ్ టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో హెడ్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బ్రూక్ రెండో స్థానానికి, రూట్ మూడో స్థానానికి పడిపోయారు.
బుమ్రా మళ్లీ నంబర్-1 బౌలర్:
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మరోసారి నంబర్-1 బౌలర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ పేసర్ మాట్ హెన్రీ రెండో స్థానానికి పడిపోవడంతో బుమ్రా అగ్రస్థానాన్ని తిరిగి సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ విజయం అనంతరం రచిన్ రవీంద్ర ఏడో స్థానానికి, డారిల్ మిచెల్ 11వ స్థానానికి, డెవాన్ కాన్వే సంయుక్తంగా 15వ స్థానానికి, టామ్ లాథమ్ సంయుక్తంగా 31వ స్థానానికి చేరుకున్నారు. బౌలింగ్‌లో న్యూజిలాండ్ పేసర్ నాథన్ స్మిత్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 38వ స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టెస్ట్ ఆల్‌రౌండర్ల జాబితాలో మూడో స్థానంలో తన కెరీర్‌ను ముగించాడు.




