Ishan Kishan: అయ్యో ఇషాన్ కిషన్.. అప్పుడే ఇన్ని ఓడిపోయావా.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు!
Ishan Kishan: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి ఆరు మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయిన మొదటి కెప్టెన్‌గా రికార్డుల్లో నిలిచాడు.
Ishan Kishan: అయ్యో ఇషాన్ కిషన్.. అప్పుడే ఇన్ని ఓడిపోయావా.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు!
Ishan Kishan: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) కెప్టెన్ ఇషాన్ కిషన్ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి ఆరు మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయిన మొదటి కెప్టెన్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడడంతో అతడి ఖాతాలో ఈ చెత్త రికార్డు చేరింది. ఐపీఎల్ 2026లో ఎస్‌ఆర్‌హెచ్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా టోర్నీకి దూరమవగా.. ఇషాన్ తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2026లో సారథిగా ఇప్పటివరకు ఇషాన్ టాస్ గెలవలేదు.
ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లతో ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లు ఆడింది. ఈ ఆరు మ్యాచ్‌లలో ఇషాన్ కిషన్ టాస్ గెలవలేదు. ఇంతకుముందు ఈ చెత్త రికార్డు డేవిడ్ మిల్లర్ పేరిట ఉండేది. 2016లో పంజాబ్ కింగ్స్ తరఫున మిల్లర్ ఐదు వరుస టాస్‌లు ఓడిపోయాడు.
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్లలో కూడా వరుసగా ఎక్కువ టాస్‌లు ఓడిన రికార్డులో ఇషాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2015 సీజన్‌లో డేవిడ్ వార్నర్ ఆరు టాస్‌లు వరుసగా కోల్పోయాడు. ఇప్పుడు అదే రికార్డును ఇషాన్ కిషన్ సమం చేశాడు. 2019లో కేన్ విలియమ్సన్ ఐదు టాస్‌లు వరుసగా ఓడిపోయిన రికార్డు కూడా ఉంది.
టాస్ ఓడిపోవడం మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా నిర్ణయించకపోయినా.. కొన్ని సందర్భాల్లో మాత్రం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా డ్యూ ప్రభావం, పిచ్ పరిస్థితులు వంటి అంశాలు ఉన్నప్పుడు టాస్ గెలవడం జట్లకు అదనపు ప్రయోజనంను ఇస్తుంది. కొన్నిసార్లు టాస్ గెలవడం చాలా ముఖ్యమనే చెప్పాలి. ఇషాన్ కిషన్ ఈ సీజన్‌లో టాస్ దురదృష్టాన్ని అధిగమించి జట్టును విజయాల దిశగా నడిపించాల్సిన అవసరం ఉంది. ఇషాన్ ఇప్పటికైనా టాస్ గెలుస్తాడేమో చూడాలి.
వరుసగా అత్యధిక టాస్‌లు ఓడిపోయిన ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్లు:
# 6 - డేవిడ్ వార్నర్ (2015)
# 6* - ఇషాన్ కిషన్ (2026)
# 5 - కేన్ విలియమ్సన్ (2019)




