Jasprit Bumrah ICC Stats: తరానికి 'ఒకే ఒక్కడు'.. జస్ప్రీత్ బుమ్రా ఈ రికార్డు తెలిస్తే మెంటలెక్కుద్ది!

Jasprit Bumrah ICC Stats: జస్ప్రీత్ బుమ్రా నాలుగు టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో కలిపి కేవలం 9 సిక్సులు మాత్రమే ఇచ్చాడు. టీ20 ఫార్మాట్‌లో బ్యాటర్లు సిక్సర్లు కొట్టడమే లక్ష్యంగా ఆడే పరిస్థితుల్లో ఈ రికార్డు అరుదైనదే అని చెప్పాలి.

Rishvik
Published on: 10 March 2026 4:58 PM IST
Jasprit Bumrah ICC Stats: తరానికి ఒకే ఒక్కడు.. జస్ప్రీత్ బుమ్రా ఈ రికార్డు తెలిస్తే మెంటలెక్కుద్ది!
X

Jasprit Bumrah ICC Stats: తరానికి 'ఒకే ఒక్కడు'.. జస్ప్రీత్ బుమ్రా ఈ రికార్డు తెలిస్తే మెంటలెక్కుద్ది!

Jasprit Bumrah ICC Stats: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన బౌలర్లలో ఒకడన్న విషయం తెలిసిందే. పిచ్ ఏదైనా, బ్యాటర్ ఎవరైనా.. బుమ్రా బంతి వేస్తే వికెట్ పడాల్సిందే. అందుకే బూమ్ బూమ్ బౌలింగ్ చేస్తున్నాడంటే.. సిక్సులు కొట్టే బ్యాటర్లు కూడా వికెట్ కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. అందుకే మనోడిని 'పిసినారి బౌలర్' అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఎంత పిసినారి అంటే.. టీ20 వరల్డ్ కప్ వంటి పెద్ద టోర్నీల్లో మిగతా బౌలర్లు పదేపదే సిక్సులు ఇస్తుంటే, బుమ్రా మాత్రం హార్డ్ హిట్టర్లను కూడా సిక్సులు కొట్టకుండా కట్టడి చేస్తాడు. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో అతడి బౌలింగ్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో జస్ప్రీత్ బుమ్రా రికార్డు మెంటలెక్కేలా ఉంది. 2016 టీ20 వరల్డ్ కప్‌ మొత్తం టోర్నీలో కేవలం 2 సిక్సులు మాత్రమే ఇచ్చాడు. 2021 టీ20 వరల్డ్ కప్‌ టోర్నీలో కూడా రెండే సిక్సులు ఇచ్చాడు. టీ20 ప్రపంచ కప్‌ 2024లో కూడా బుమ్రా బ్యాటర్లను కట్టడి చేస్తూ.. కేవలం రెండే సిక్సులు ఇచ్చాడు. తాజా 2026 టీ20 వరల్డ్ కప్‌లో కూడా బుమ్రా కేవలం 3 సిక్సులు మాత్రమే ఇచ్చి.. తన కట్టుదిట్టమైన బౌలింగ్‌ను మరోసారి నిరూపించాడు. మొత్తంగా నాలుగు టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో కలిపి కేవలం 9 సిక్సులు మాత్రమే ఇచ్చాడు. టీ20 ఫార్మాట్‌లో బ్యాటర్లు సిక్సర్లు కొట్టడమే లక్ష్యంగా ఆడే పరిస్థితుల్లో ఈ రికార్డు అరుదైనదే అని చెప్పాలి.

టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌'గా నిలిచాడు. ఈ టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు (14) తీసిన బౌలర్ కూడా బుమ్రానే. ఈ ప్రపంచ కప్‌లో 28 ఓవర్లు వేసిన బుమ్రా.. కేవలం 174 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ గణాంకాలు చూస్తే బుమ్రాను ఎందుకు “వన్స్ ఇన్ ఎ జనరేషన్ బౌలర్” అని పిలుస్తారో స్పష్టంగా తెలుస్తుంది. కీలక సందర్భాల్లో వికెట్లు తీస్తూ, పరుగులు కట్టడి చేస్తూ టీమిండియా విజయాల్లో అతడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. అందుకే ప్రపంచ క్రికెట్‌లో బుమ్రాను అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా అభిమానులు, క్రికెట్ నిపుణులు ప్రశంసిస్తున్నారు. తరానికి 'ఒకే ఒక్కడు' అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Rishvik

Rishvik

Next Story