Bumrah vs Siraj: హైదరాబాద్‌లో డీఎస్పీ కారు ఎక్కడా కనిపించదు ఏంటి?.. సిరాజ్‌పై బుమ్రా సెటైర్లు!

Bumrah vs Siraj: తెలంగాణలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా నియమితుడైనమహ్మద్ సిరాజ్‌ను జస్ప్రీత్ బుమ్రా ఆటపట్టించాడు.

Rishvik
Published on: 21 April 2026 8:29 PM IST
Bumrah vs Siraj
X

Bumrah vs Siraj: హైదరాబాద్‌లో డీఎస్పీ కారు ఎక్కడా కనిపించదు ఏంటి?.. సిరాజ్‌పై బుమ్రా సెటైర్లు!

Bumrah vs Siraj: ఐపీఎల్‌ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ (ఎంఐ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 99 పరుగుల తేడాతో ముంబై భారీ విజయం అందుకుంది. 200 టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ 15.5 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

పీఎల్ 2026 సీజన్‌ని విజయంతో ఆరంభించి వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన ముంబై.. ఎట్టకేలకు కమ్‌బ్యాక్ ఇచ్చింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం భారత స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం భారత జట్టులో కీలక బౌలర్లుగా ఉన్నారు. ఈ ఇద్దరూ ఐపీఎల్‌ 2026లో వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బుమ్రా ముంబై ఇండియన్స్‌కు ప్రధాన బౌలర్ కాగా.. సిరాజ్ గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు.

మ్యాచ్ అనంతరం బుమ్రా, సిరాజ్ మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా నియమితుడైన సిరాజ్‌ను బుమ్రా ఆటపట్టించాడు. ‘నేను హైదరాబాద్‌కు వెళ్లినపుడు బిర్యాని అడిగితే పంపిస్తాడు. కానీ డీఎస్పీ కారు ఎక్కడా కనిపించదు’ అంటూ జోక్ చేశాడు. ఈ కామెంట్స్ అభిమానుల్లో నవ్వులు పూయించాయి.

ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్‌ను తొలి బంతికే అవుట్ చేసి తన క్లాస్‌ను చూపించాడు. ఐపీఎల్‌లో మొత్తంగా 146 బంతుల తర్వాత బుమ్రాకి వికెట్ దక్కింది. ఈ సీజన్‌లో 114 బాల్స్ అనంతరం దక్కిన వికెట్. బుమ్రా తొలి ఓవర్ వేయడం కీలక మలుపుగా మారింది.

మాజీ న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ మెక్‌క్లెనాఘన్ ఈ నిర్ణయాన్ని “మాస్టర్ స్ట్రోక్”గా అభివర్ణించాడు. గుజరాత్ బలమైన ఓపెనింగ్ జోడీ అయిన శుభ్‌మన్ గిల్. సాయి సుదర్శన్‌లను విడదీయడానికి బుమ్రాను ముందుగానే ఉపయోగించడం అద్భుత వ్యూహమని ప్రశంసించాడు. మరోవైపు సిరాజ్ కూడా ఒక వికెట్ తీసుకున్నప్పటికీ.. మ్యాచ్‌లో గుజరాత్ ఓటమి పాలైంది.


Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story