Joe Root: 149 ఏళ్ల క్రికెట్ చరిత్రలో జోరూట్ సంచలనం..ఏకైక క్రికెటర్‌గా రికార్డ్
Joe Root: పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టులో 69వ అర్ధ శతకం సాధించి సచిన్ టెండూల్కర్ (68) ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్.
Joe Root: 149 ఏళ్ల క్రికెట్ చరిత్రలో జోరూట్ సంచలనం..ఏకైక క్రికెటర్‌గా రికార్డ్
Joe Root: ఇంగ్లండ్ రన్ మెషిన్ జో రూట్ టెస్టు క్రికెట్‌లో ఎవరికీ సాధ్యంకాని అరుదైన ఘనత సాధించి ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. క్రికెట్ ప్రపంచం దశాబ్దాలుగా సురక్షితం అనుకున్న 'మాస్టర్ బ్లాస్టర్' సచిన్ టెండూల్కర్ రికార్డును కనుమరుగు చేస్తూ, టెస్టు క్రికెట్ 149 ఏళ్ల చరిత్రలోనే అత్యధిక అర్ధ శతకాలు సాధించిన బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
బర్మింగ్‌హామ్‌లోని చారిత్రక ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆఖరి ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతంగా ఆడిన రూట్.. కేవలం 69 బంతుల్లో 62 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో తన టెస్టు కెరీర్‌లో 69వ అర్ధ శతకాన్ని పూర్తి చేసుకుని సచిన్ పేరిట ఉన్న 68 ఫిఫ్టీల రికార్డును దాటేశాడు.
జో రూట్ (ఇంగ్లండ్) : 69 అర్ధ శతకాలు
సచిన్ టెండూల్కర్ (భారత్) : 68 అర్ధ శతకాలు
శివనారాయణ్ చందర్‌పాల్ (వెస్టిండీస్): 66 అర్ధ శతకాలు
ఈ చారిత్రక మ్యాచ్‌తో జో రూట్ ఖాతాలో మరికొన్ని అరుదైన మైలురాళ్లు చేరాయి. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో 1,000 కంటే ఎక్కువ టెస్టు పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్ర పుటల్లోకెక్కాడు. ప్రపంచ వ్యాప్తంగా 4 వేర్వేరు మైదానాల్లో 1,000 పైగా టెస్టు పరుగులు సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. గతంలో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ మాత్రమే ఈ మైలురాయిని అందుకున్నారు.
లక్ష్య ఛేదనలో వికెట్లు పడుతున్నా ఒత్తిడికి గురికాకుండా క్రీజులో పాతుకుపోయి మ్యాచ్‌ను గెలిపించడం రూట్‌కు వెన్నతో పెట్టిన విద్య. పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లోనూ తన క్లాస్ ఏంటో మరోసారి నిరూపించాడు. ఆధునిక క్రికెట్ ఫ్యాబ్-4లో అత్యంత నిలకడగా పరుగులు సాధిస్తూ, టెస్టుల్లో ఆల్-టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడిగా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.




