Josh Inglis Record: చెపాక్‌లో చెలరేగిన జోష్ ఇంగ్లిస్.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు.. టాప్ 5లో నాలుగు సార్లు పూరన్!

Josh Inglis Fastest Fifty Record. లక్నో సూపర్ జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జీ) ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.

Rishvik
Published on: 10 May 2026 5:05 PM IST
Josh Inglis Record
X

Josh Inglis Record: చెపాక్‌లో చెలరేగిన జోష్ ఇంగ్లిస్.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు.. టాప్ 5లో నాలుగు సార్లు పూరన్!

Josh Inglis Record: ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జీ) ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఎల్‌ఎస్‌జీ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (ఐపీఎల్) 2026లో భాగంగా ఆదివారం చెపాక్‌ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లిస్ కేవలం 17 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి ఈ రికార్డు నెలకొల్పాడు. చెన్నై ఎపిన్నారు అకీల్ హొస్సేన్ వేసిన ఐదో ఓవర్‌లో రెండో బంతికి ఫోర్ బాది అర్ధ శతకం అందుకున్నాడు. జోష్ ఇంగ్లిస్ దూకుడుతో ఎల్‌ఎస్‌జీ భారీ స్కోర్ చేసింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (ఐపీఎల్) లక్నో సూపర్ జెయింట్స్‌ తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ బాదిన బ్యాటర్ల జాబితాలో వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌ల్లో జట్టుకు విజయాలు అందించిన పూరన్.. ఎల్‌ఎస్‌జీ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును కూడా తన పేరిటే లిఖించుకున్నాడు. 2023 సీజన్‌లో బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పూరన్ కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఇది ఇప్పటికీ లక్నో జట్టు తరఫున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా నిలిచింది. 2026లో ముంబై ఇండియన్స్‌పై వాంఖడే స్టేడియంలో 16 బంతుల్లో ఫిఫ్టీ చేసి మరోసారి తన పవర్ హిట్టింగ్‌ను చాటుకున్నాడు.

ఈ జాబితాలో తాజాగా జోష్ ఇంగ్లిస్ కూడా చేరాడు. నికోలస్ పూరన్ ఈ జాబితాలో మరో రెండు సార్లు చోటు సంపాదించడం విశేషం. 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై హైదరాబాద్‌లో 18 బంతుల్లో ఫిఫ్టీ చేసిన పూరన్.. 2024లో ముంబై ఇండియన్స్‌పై 19 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో ఎల్‌ఎస్‌జీ తరఫున అత్యంత వేగంగా అర్ధ సెంచరీలు చేసిన టాప్-5 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు పూరన్ పేరిట ఉండటం అతడి విధ్వంసకర బ్యాటింగ్‌కు నిదర్శనంగా నిలిచింది.

ఎల్‌ఎస్‌జీ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ లిస్ట్:

15 - నికోలస్ పూరన్ vs ఆర్సీబీ, బెంగళూరు, 2023

16 - నికోలస్ పూరన్ vs ఎంఐ, ముంబై WS, 2026

17 - జోష్ ఇంగ్లిస్ vs సీఎస్కే, చెన్నై, 2026

18 - నికోలస్ పూరన్ vs ఎస్‌ఆర్‌హెచ్‌, హైదరాబాద్, 2025

19 - నికోలస్ పూరన్ vs ఎంఐ, ముంబై, 2024

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story