Kavya Maran Marriage: ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ పెళ్లి ఫిక్స్.. కన్‌ఫామ్ చేసిన ప్రముఖ నటుడు!
Kavya Maran Marriage: Kavya Maran to Marry Anirudh Ravichander కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
Kavya Maran Marriage: ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ పెళ్లి ఫిక్స్.. కన్‌ఫామ్ చేసిన ప్రముఖ నటుడు!
Kavya Maran Marriage: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) యజమాని కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. గత కొద్ది రోజులుగా వీరిద్దరి వివాహంపై పలు కథనాలు ప్రచారంలో ఉండగా.. తాజాగా అనిరుధ్ కుటుంబ సభ్యుడు చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. తమిళ నటుడు, అనిరుధ్ మేనమామ వై.జీ. మహేంద్ర కావ్య-అనిరుధ్ రూమర్స్‌పై స్పందించారు.
మహేంద్ర ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'నా వరకు తెలిసిన సమాచారం ప్రకారం అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ పెళ్లి చేసుకోబోతున్నారు. కావ్య సాధారణ అమ్మాయి కాదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి పెద్ద ఫ్రాంచైజీని నిర్వహించే సామర్థ్యం ఆమెకు ఉంది. తండ్రి నుంచి వ్యాపార నైపుణ్యాలను అందిపుచ్చుకుంది. ఇద్దరూ మంచి జోడీ. పెళ్లి తర్వాత కలిసి సంగీతం, వ్యాపార రంగాల్లోనూ మంచి విజయాలు సాధిస్తారని భావిస్తున్నాను' అని చెప్పారు. ప్రస్తుతం నటుడు మహేంద్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే ఇప్పటివరకు అటు అనిరుధ్ రవిచందర్ కానీ.. ఇటు కావ్య మారన్ కానీ తమ రిలేషన్‌షిప్ లేదా పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కావ్య-అనిరుధ్ పెళ్లి వార్తలపై అధికారిక ధృవీకరణ ఇంకా రావాల్సి ఉంది. అనిరుధ్ రవిచందర్ 2011లో విడుదలైన 'వై దిస్ కొలవెరి డి' పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత జైలర్, లియో, మాస్టర్, బీస్ట్, విక్రమ్, జవాన్, జెర్సీ, గ్యాంగ్ లీడర్, దేవర వంటి పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించి దక్షిణ భారత సినీ పరిశ్రమలో అగ్ర సంగీత దర్శకుడిగా ఎదిగాడు. సౌత్ ఇండియాలోనే కాదు.. బాలీవుడ్‌లోనూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకెళ్తున్నాడు. ప్రముఖ నటుడు రజనీకాంత్ కుటుంబానికి చెందిన అనిరుధ్.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు.
మరోవైపు కావ్య మారన్ ప్రముఖ వ్యాపారవేత్త కలానిధి మారన్ కుమార్తె. ఆమె సన్ టీవీ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఎస్‌ఏ20లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ది హండ్రెడ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ జట్ల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఆమె భావోద్వేగ ఎక్స్ప్రెషన్స్ అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. తెలుగు అభిమానులు ఆమెను ముద్దుగా 'కావ్య పాప' అని పిలుస్తుంటారు.
ఐపీఎల్ 2026లో ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అయితే ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక కావ్య మారన్, అనిరుధ్ పెళ్లిపై వస్తున్న వార్తలపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




