Khaleel Ahmed Out: విజయాల జోష్‌లో ఉన్న సీఎస్‌కేకు భారీ షాక్.. ఐపీఎల్ 2026 నుంచి మ్యాచ్ విన్నర్ అవుట్!
Khaleel Ahmed Out: ఐపీఎల్ 2026లో రెండు వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు భారీ దెబ్బ తగిలింది.
Khaleel Ahmed Out: విజయాల జోష్‌లో ఉన్న సీఎస్‌కేకు భారీ షాక్.. ఐపీఎల్ 2026 నుంచి మ్యాచ్ విన్నర్ అవుట్!
Khaleel Ahmed Out: ఐపీఎల్ 2026లో రెండు వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు భారీ దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ అధికారికంగా వెల్లడించింది. ఖలీల్ స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ఇంకా సీఎస్‌కే వెల్లడించలేదు. ఖలీల్ కోలుకోవడానికి కనీసం 10-12 వారాలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు సీఎస్‌కే పేస్ భారాన్ని ఖలీల్ అహ్మద్ మోసిన విషయం తెలిసిందే. ఆలాంటి ఆటగాడు ఐపీఎల్ 2026 నుంచి నిష్క్రమించడం చెన్నైకి భారీ షాక్ అనే చెప్పాలి.
తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్ గాయపడ్డాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో చివరి బంతి వేయడానికి పరుగెత్తుతున్న సమయంలో అతని కుడి తొడలో అసౌకర్యం కలిగింది. ఫిజియో వచ్చి చికిత్స చేసినా.. బౌలింగ్ చేయలేక మైదానంను వీడాడు. ఖలీల్ అహ్మద్‌కు క్వాడ్రిసెప్స్‌లో తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది. అతడికి గ్రేడ్-2 మసిల్ టియర్‌గా నిర్ధారణ అయింది. రైట్ రెక్టస్ ఫెమోరిస్ టెండన్ (తొడ ముందు భాగంలో ఉండే ప్రధాన కండరం)లో స్ట్రెచ్ ఇంజురీతో పాటు మసిల్ డైరెక్ట్ హెడ్ పూర్తిగా చీలిపోయినట్లు సమాచారం. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి కనీసం 10-12 వారాలు పట్టే అవకాశం ఉంది. దీంతో ఖలీల్ ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
ఖలీల్ అహ్మద్ లాంటి ఎడమచేతి పేసర్ జట్టుకు ఎంతో కీలకం. కొత్త బంతితో వికెట్లు తీసే సామర్థ్యంతో పాటు డెత్ ఓవర్లలో కూడా సమర్థంగా బౌలింగ్ చేసే నైపుణ్యం అతనికి ఉంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కూడా ఖలీల్ పాల్గొన్నాడు. కేకేఆర్ మ్యాచ్‌లో ఒక వికెట్ తీసి 24 పరుగులు ఇచ్చి మంచి ప్రదర్శన చేశాడు. అతని గైర్హాజరీ జట్టు బౌలింగ్ విభాగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఖలీల్ స్థానాన్ని భర్తీ చేయడం సీఎస్‌కేకు పెద్ద సవాల్ అనే చెప్పాలి. ముకేష్ చౌదరి లైక్-టు-లైక్ రీప్లేస్‌మెంట్‌గా వచ్చే ఛాన్స్ ఉంది. జకరీ ఫౌల్క్స్, స్పెన్సర్ జాన్సన్ వంటి విదేశీ పేసర్లు కూడా ఆప్షన్లుగా ఉన్నారు. అయితే వీరిని జట్టులోకి తీసుకోవాలంటే విదేశీ ఆటగాళ్ల కాంబినేషన్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం సీఎస్‌కే విదేశీ ఆటగాళ్ల కోటాలో డేవాల్డ్ బ్రేవిస్, నూర్ అహ్మద్, ఆకీల్ హొసేన్, జేమీ ఓవర్టన్‌లతో బరిలోకి దిగుతోంది. మరో విదేశీ పేసర్‌ను తీసుకోవాలంటే వీరిలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. నూర్ అహ్మద్ లేదా ఆకీల్ హొసేన్ స్థానంలో మార్పు చేసే అవకాశాలు ఉన్నాయి. అవసరమైతే కొత్త రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌ను కూడా ఎంపిక చేసే అవకాశం సీఎస్‌కేకు ఉంది. మొత్తానికి ఖలీల్ అహ్మద్ గాయం సీఎస్‌కేకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.




