KKR vs RR: హమ్మయ్య.. ఎట్టకేలకు ఐపీఎల్ 2026లో బోణీ కొట్టిన కేకేర్
KKR vs RR: ఎట్టకేలకు ఐపీఎల్ 2026లో కోల్‌కతా బోణీ కొట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
KKR vs RR: హమ్మయ్య.. ఎట్టకేలకు ఐపీఎల్ 2026లో బోణీ కొట్టిన కేకేర్
KKR vs RR: ఎట్టకేలకు ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) బోణీ కొట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 156 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా మరో రెండు బంతులు ఉండగా.. 6 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. రింకు సింగ్ (53 నాటౌట్; 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులు) కేకేఆర్‌ను గెలిపించాడు.
అనుకుల్ రాయ్ (29) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో కోల్‌కతా పాయింట్ల సంఖ్య 3కు చేరింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. కోల్‌కతాకు ఓ పాయింట్ వచ్చింది. 7వ మ్యాచ్‌లో కేకేఆర్ మొదటి విజయాన్ని అందుకుంది. దాంతో కోల్‌కతా ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మోస్తరు లక్ష్య ఛేదనలో కోల్‌కతాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. మొదటి ఓవర్లో ఓపెనర్ టిమ్ సిఫర్ట్ (0) త్వరగానే ఔటయ్యాడు. రెండో ఓవర్లో కెప్టెన్ అజింక్య రహానే పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో రఘువంశీ (10) నెమ్మదిగా ఆడగా.. కామెరూన్ గ్రీన్ (27) ధాటిగా ఆడాడు. దూకుడుగా ఆడుతున్న గ్రీన్ ఔటయ్యాడు. జడేజా తన మొదటి ఓవర్‌లో రఘువంశీ (10)ని ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు.
కాసేపటికి రొవ్‌మన్ పావెల్ (23) ఔట్ అవ్వడంతో కేకేఆర్ ఓటమి దిశగా సాగింది. ఈ సమయంలో రింకు సింగ్ బాధ్యతగా ఆడాడు. రమణ్‌దీప్ సింగ్ (10) అవుట్ అయినా అనుకుల్ రాయ్ అండతో స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. రింకు కాస్త దూకుడుగా ఆడడంతో.. చివరి రెండు ఓవర్లలో కేకేఆర్ విజయ లక్ష్యం 21 పరుగులుగా మారింది. 19 ఓవర్‌లో 12 రన్స్ రాగా.. చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరం అయ్యాయి. రింకు రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాది మ్యాచ్ ముగించాడు. రాజస్థాన్ బౌలర్ జడేజా రెండు వికెట్స్ తీశాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 రన్స్ చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ (46) టాప్ స్కోరర్. యశస్వి జైశ్వాల్ (39) రాణించాడు. మిగితా బ్యాటర్లు అందరూ దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ రియాన్ పరాగ్ (12), షిమ్రాన్ హెట్మయర్ (15) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ అందుకున్నారు. కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి మూడేసి వికెట్లు పడగొట్టగా.. సునీల్ నరైన్ రెండు వికెట్లు తీశాడు. కోల్‌కతా విజయంలో రింకు, వరుణ్ కీలక పాత్ర పోచించారు.




