KKR-Blessing Muzarabani: షాకింగ్.. కేకేఆర్ బౌలర్‌పై రెండేళ్ల నిషేధం!
KKR-Blessing Muzarabani: జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానికి పీఎస్ఎల్ నిర్వాహకులు భారీ షాక్ ఇచ్చారు.
KKR-Blessing Muzarabani: షాకింగ్.. కేకేఆర్ బౌలర్‌పై రెండేళ్ల నిషేధం!
KKR-Blessing Muzarabani: జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానికి పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నిర్వాహకులు భారీ షాక్ ఇచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో ఆడేందుకు పీఎస్ఎల్ 2026 కాంట్రాక్ట్‌ను విరమించుకున్న కారణంగా అతనిపై రెండు సంవత్సరాల నిషేధాన్ని విధించారు. ఈ నిషేధంతో ఐపీఎల్ 2027, ఐపీఎల్ 2028లో ముజరబాని ఆడేందుకు వీల్లేదు. పీఎస్ఎల్ నిర్ణయం ఫ్రాంచైజీ క్రికెట్‌లో కాంట్రాక్ట్ నిబంధనలు ఎంత ముఖ్యమో మరోసారి నిరూపించింది.
ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2026 ఐపీఎల్, పీఎస్ఎల్ 2026 వేలాల్లో బ్లెస్సింగ్ ముజరబాని అమ్ముడుపోలేదు. ఆపై ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టులో రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా చేరాడు. కొన్ని కారణాలతో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రిలీజ్ చేసింది. టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే తరఫున ముజరబాని అదరగొట్టాడు.
మెగా టోర్నీలో 13 వికెట్లు పడగొట్టి జింబాబ్వే సూపర్-8కి చేరడంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతడికి కేకేఆర్ నుంచి పిలుపు వచ్చింది. ఐపీఎల్‌లో ఆడేందుకు ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు నుంచి వైదొలిగాడు. ఈ నిర్ణయం పీఎస్ఎల్ నిర్వాహకులకు ఆగ్రహం తెప్పించింది. ముజరబానిపై రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఒక కాంట్రాక్ట్ కొనసాగుతున్న సమయంలో మరో లీగ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ప్రొఫెషనల్ నిబంధనలకు విరుద్ధమని పీఎస్ఎల్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇలాంటి చర్యలు ఫ్రాంచైజీల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించింది. అందుకే ఈ ఉల్లంఘన తీవ్రతను దృష్టిలో పెట్టుకుని.. బ్లెస్సింగ్ ముజరబానిపై రెండేళ్ల నిషేధం విధించినట్లు తెలిపింది.
ఇక ఇప్పటికే ఐపీఎల్ 2026లో కేకేఆర్ తరఫున ముజరబాని రెండు మ్యాచ్‌లు ఆడి ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 4/41 గణాంకాలతో సత్తా చాటాడు. అతని ప్రదర్శన ప్రశంసలు అందుకున్నప్పటికీ.. పీఎస్ఎల్ నిషేధం అతని కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముజరబాని జింబాబ్వే తరఫున 80 అంతర్జాతీయ టీ20ల్లో 90కి పైగా వికెట్లు తీసి సత్తా చాటాడు. ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌ల్లోనూ ఆడాడు.




