Virat Kohli: ధోనీ, రోహిత్ కాదు.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లీనే 'కింగ్'!
Virat Kohli: విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఐపీఎల్ ద్వారా మొత్తం రూ.230.2 కోట్లు ఆర్జించాడు.
Virat Kohli: ధోనీ, రోహిత్ కాదు.. ఐపీఎల్ చరిత్రలో కోహ్లీనే 'కింగ్'!
Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్. ఐపీఎల్ మెగా లీగ్ మాత్రమే కాదు.. క్రికెటర్లకు భారీగా సంపాదించే వేదిక కూడా. అందుకే విదేశీ ఆటగాళ్లు ఇండియా టీ20 టోర్నీలో ఆడాలని చూస్తుంటారు. గత 19 ఏళ్లుగా స్టార్ బ్యాటర్లు కొందరు ఐపీఎల్ ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తూ వస్తున్నారు. తాజాగా ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా సంపాదించిన ఆటగాళ్ల జాబితా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సంస్థలు ఫెనాటిక్ స్పోర్ట్స్, హురూన్ సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదికలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు.
2008లో ప్రారంభమైన తొలి సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకే ఆడుతున్న విరాట్ కోహ్లీ.. ఇప్పటివరకు ఐపీఎల్ ద్వారా మొత్తం రూ.230.2 కోట్లు ఆర్జించాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా సంపాదించిన ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ తర్వాతి స్థానంలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ ఇప్పటివరకు రూ.227.2 కోట్లు సంపాదించాడు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రూ.200.3 కోట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా నాలుగో స్థానంలో నిలిచాడు. జడేజా ఐపీఎల్ ద్వారా రూ.157 కోట్ల ఆదాయం పొందాడు.
ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్గా ఉన్న రిషభ్ పంత్ రూ.137.8 కోట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ రూ.137.2 కోట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ రూ.126.5 కోట్లతో ఏడో స్థానంలో నిలవగా.. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రూ.126.1 కోట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రూ.126 కోట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు.
ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రూ.122 కోట్ల సంపాదనతో టాప్-10లో ఉన్నాడు. రాబోయే కాలంలో ఈ గణాంకాలు భారీగా పెరిగే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు కూడా ఇప్పుడు కోట్లలో ఒప్పందాలు లభిస్తున్నాయి. దీంతో ఐపీఎల్ ప్రపంచ క్రీడా రంగంలో అత్యంత ధనిక లీగ్లలో ఒకటిగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది.
ఐపీఎల్లో అత్యధికంగా సంపాదించిన టాప్-10 ఆటగాళ్లు:
విరాట్ కోహ్లీ – రూ.230.2 కోట్లు
రోహిత్ శర్మ – రూ.227.2 కోట్లు
ఎంఎస్ ధోనీ – రూ.200.3 కోట్లు
రవీంద్ర జడేజా – రూ.157.0 కోట్లు
రిషభ్ పంత్ – రూ.137.8 కోట్లు
సునీల్ నరైన్ – రూ.137.2 కోట్లు
సంజూ శాంసన్ – రూ.126.5 కోట్లు
కేఎల్ రాహుల్ – రూ.126.1 కోట్లు
శ్రేయస్ అయ్యర్ – రూ.126.0 కోట్లు
హార్దిక్ పాండ్యా – రూ.122.0 కోట్లు




