Krunal Pandya: ఆర్సీబీకి షాక్.. కృనాల్ పాండ్య బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు, విచారణ ప్రారంభం!

Krunal Pandya Bowling Action Under Scanner: ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు భారీ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి.

Rishvik
Published on: 25 April 2026 5:42 PM IST
Krunal Pandya
X

Krunal Pandya

Krunal Pandya: ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు భారీ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య బౌలింగ్ యాక్షన్‌పై భారత క్రికెట్ మండలి (బీసీసీఐ)కి ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కృనాల్ బౌలింగ్ యాక్షన్‌పై అధికారిక విచారణ ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుతం కృనాల్ బౌలింగ్ యాక్షన్‌ను సమీక్షిస్తూ.. అతని చర్యలను నిశితంగా గమనించనున్నట్లు సమాచారం.

కృనాల్ పాండ్య తన బౌలింగ్‌లో కొత్త మార్పులు చేశాడు. అతడి బౌలింగ్ యాక్షన్‌ పూర్తి బిన్నంగా ఉంది. స్పిన్ బౌలర్‌గా బౌన్సర్లు వేస్తూ.. బ్యాట్స్‌మన్‌లను ఆశ్చర్యపరుస్తున్నాడు. అయితే విచారణలో బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలితే.. కృనాల్ తన యాక్షన్‌లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. ఇదే నిజమైతే.. ఆర్సీబీ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారే అవకాశముంది.

ఇప్పటికే ఐపీఎల్‌ 2026లో కీలక మ్యాచ్‌లు జరగ్గుతున్నాయి. ప్లే ఆఫ్స్ కోసం అన్ని టీమ్స్ గట్టిగా పోరాడుతున్నాయి. ఈ సమయంలో కృనాల్ పాండ్య అందుబాటులో లేకపోతే ఆర్సీబీకి నష్టమే. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగే మ్యాచ్‌కు అతను దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో క్రునాల్ లేకపోతే.. ఆర్సీబీ బౌలింగ్ దళంపై ప్రభావం పడే అవకాశముంది.

కృనాల్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ కీలక పాత్ర పోషిస్తాడు. కృనాల్ తన ప్రదర్శనతో టీమిండియాలోకి తిరిగి రావాలని చూస్తున్నాడు. ఈ సమయంలో అతని భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఇక బీసీసీఐ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

ఐపీఎల్ 2026లో ఆర్సీబీ ఊకుడుమీదుంది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఆర్సీబీ ఖాతాలో ఇపుడు 10 పాయింట్స్ ఉండగా.. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇంకా 6 పాయింట్స్ కావాలి. లీగ్ దశలో మిగిలిన 7 మ్యాచ్‌ల్లో 3 సాధిస్తే అధికారిక బెర్త్ దక్కుతుంది. చివరి మ్యాచులో గుజరాత్‌ టైటాన్స్‌ను బెంగళూరు ఓడించింది. గుజరాత్‌ ముందుగా 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని బెంగళూరు 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story