Kuldeep Yadav: టీమిండియాలో నో ఛాన్స్.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
Kuldeep Yadav: Kuldeep Yadav signs with Yorkshire. టీమిండియా స్టార్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
Kuldeep Yadav: టీమిండియాలో నో ఛాన్స్.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
Kuldeep Yadav: టీమిండియా స్టార్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో ప్రముఖ కౌంటీ క్లబ్ యార్క్‌షైర్ తరఫున ఆడేందుకు కుల్దీప్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. భారత టెస్టు సహా వన్డే జట్టులో వరుసగా తుది జట్టుకు దూరమవుతున్న కుల్దీప్.. ఇప్పుడు కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు ఓకే చెప్పాడు. ఇటీవల ఇంగ్లండ్ జట్టుతో ముగిసిన వన్డే సిరీస్‌లో కుల్దీప్‌కు ప్లేయింగ్ 11లో చోటు దక్కని విషయం తెలిసిందే.
ప్రస్తుత సీజన్‌లో మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడేందుకు యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కుల్దీప్ యాదవ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో ఐదు మెట్రో బ్యాంక్ వన్డే కప్ మ్యాచ్‌లు, మూడు రోతేసే కౌంటీ ఛాంపియన్‌షిప్ (రెడ్ బాల్) మ్యాచ్‌లు ఉన్నాయి. శుక్రవారం గ్లామోర్గన్‌తో జరిగే వన్డే మ్యాచ్ నుంచే కుల్దీప్ జట్టులో చేరనున్నాడు. యార్క్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం కుల్దీప్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 'యార్క్‌షైర్ వంటి గొప్ప చరిత్ర కలిగిన క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు ఎంతో గౌరవంగా ఉంది. ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఆడటం నాకు ఎప్పుడూ సవాల్‌గా అనిపిస్తుంది. జట్టు యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత ఈ అవకాశంపై మరింత ఉత్సాహం పెరిగింది. హెడ్డింగ్‌లేలో జట్టుకు నా వంతు సహకారం అందించాలని ఎదురుచూస్తున్నాను' అని తెలిపాడు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పెద్దగా నమ్మకం చూపకపోయినా.. యార్క్‌షైర్ మాత్రం కుల్దీప్‌పై పూర్తి విశ్వాసం ఉంచింది. ఈ వేసవిలో ఇంగ్లండ్‌లో పొడి వాతావరణం ఉండటంతో స్పిన్నర్ల పాత్ర కీలకమవుతుందని క్లబ్ భావిస్తోంది. యార్క్‌షైర్ క్రికెట్ జనరల్ మేనేజర్ గావిన్ హామిల్టన్ మాట్లాడుతూ... 'కుల్దీప్ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే నిరూపించుకున్నాడు. అతని లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్ మా జట్టుకు మరింత బలం చేకూరుస్తుంది. సీజన్ చివరి దశలో కుల్దీప్ అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. అతడు మా జట్టులో చేరడం ఆనందంగా ఉంది' అని పేర్కొన్నారు.
కుల్దీప్ యాదవ్ ఇప్పటివరకు భారత తరఫున 18 టెస్టుల్లో 79 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ సగటు 22 కాగా.. అత్యుత్తమ గణాంకాలు 5/40. 2024లో ఇంగ్లండ్‌తో జరిగిన స్వదేశీ టెస్టు సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. వన్డేల్లో కుల్దీప్ రికార్డు బాగుంది. 121 వన్డేల్లో 194 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన 6/25. ఇక 54 టీ20ల్లో 95 వికెట్స్ పడగొట్టాడు. ప్రస్తుతం భారత జట్టు ఆల్‌రౌండర్‌లపై మొగ్గు చూపుతుండడం, వరుణ్ చక్రవర్తి జట్టులో ఉండడంతో కుల్దీప్ యాదవ్‌కు ఎక్కువగా అవకాశాలు రావడం లేదు.
భారత యువ ఆల్‌రౌండర్ ఆశుతోష్ శర్మ కూడా ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో అద్భుత అరంగేట్రం చేశాడు. హాంప్‌షైర్ తరఫున ఆడుతున్న అతడు యార్క్‌షైర్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ 320/8 స్కోరు చేయగా.. ఆశుతోష్ బ్యాటింగ్‌లో 10 పరుగులు మాత్రమే చేశాడు. అయితే బౌలింగ్‌లో 3/48 గణాంకాలతో మెరిశాడు. ముఖ్యంగా హ్యారీ డ్యూక్, కెప్టెన్ డామ్ బెస్‌లను ఒకే ఓవర్‌లో ఔట్ చేసి మ్యాచ్‌ను హాంప్‌షైర్ వైపు తిప్పాడు. చివరకు యార్క్‌షైర్ 270 పరుగులకే ఆలౌట్ కావడంతో.. హాంప్‌షైర్ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది.




