Kyle Jamieson Video : మైదానంలో జేమీసన్ రాక్షసానందం.. చిన్నపిల్లాడిని అవుట్ చేసి అంతలా ఊగిపోవాలా?

Kyle Jamieson Video : ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసి ఢిల్లీ బౌలర్ కైల్ జేమీసన్ సింహంలా గర్జించాడు. 15 ఏళ్ల కుర్రాడిపై అంతలా రెచ్చిపోవాలా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

CR Reddy
Published on: 2 May 2026 6:58 AM IST
Kyle Jamieson Video
X

Kyle Jamieson Video 

Kyle Jamieson Video : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వికెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కైల్ జేమీసన్ అతడిని అవుట్ చేసిన తీరు కంటే, ఆ తర్వాత సెలబ్రేట్ చేసుకున్న విధానంపై తీవ్ర చర్చ నడుస్తోంది. తనకంటే వయసులో చాలా చిన్నవాడైన ఆటగాడిపై అంతలా విరుచుకుపడటం అవసరమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ బౌలర్ కైల్ జేమీసన్ వేసిన ఇన్ స్వింగ్ యార్కర్ వేగానికి వైభవ్ సూర్యవంశీ దగ్గర సమాధానం లేకపోయింది. బ్యాట్ కిందకు వచ్చేలోపే బంతి స్టంప్స్‌ను ఎగరగొట్టింది. కేవలం 4 పరుగులు మాత్రమే చేసి వైభవ్ నిరాశగా వెనుదిరిగాడు. అయితే ఆ వికెట్ పడగానే జేమీసన్ పరిగెత్తుకుంటూ వైభవ్ వైపు వెళ్ళి పెద్దగా అరుస్తూ, కోపంతో గర్జిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఒక అంతర్జాతీయ బౌలర్ చిన్న పిల్లాడిపై అలా ప్రవర్తించడం చూసి స్టేడియంలోని ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు.

వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 20 కంటే తక్కువ పరుగులకు అవుట్ అవ్వడం ఇది కేవలం ఆరోసారి మాత్రమే. అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న ఈ 15 ఏళ్ల కుర్రాడిని అవుట్ చేయడానికి ప్రతి జట్టు ప్రత్యేక ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటివరకు భువనేశ్వర్ కుమార్, కైల్ జేమీసన్ మాత్రమే అతడిని క్లీన్ బౌల్డ్ చేయగలిగారు. బహుశా అందుకేనేమో, అంతటి డేంజరస్ బ్యాటర్‌ను అవుట్ చేశాననే ఆవేశంలో జేమీసన్ తన నిగ్రహాన్ని కోల్పోయి అలా ప్రవర్తించి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఒక అరుదైన రికార్డు సృష్టించే అవకాశం తృటిలో కోల్పోయాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 100 సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచేందుకు అతడికి కేవలం ఒకే ఒక్క సిక్సర్ కావాల్సి ఉంది. ప్రస్తుతం అతను 593 బంతుల్లో 99 సిక్సర్లు కొట్టి ఉన్నాడు. కీరన్ పొలార్డ్ 843 బంతుల్లో 100 సిక్సర్లు కొట్టిన రికార్డును వైభవ్ ఈ మ్యాచ్‌లో అధిగమిస్తాడని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ జేమీసన్ యార్కర్ ఆ రికార్డుకు ప్రస్తుతానికి బ్రేక్ వేసింది.

జేమీసన్ ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు. "వైభవ్ ఇంకా 15 ఏళ్ల పిల్లాడు, తనకంటే రెట్టింపు వయసున్న జేమీసన్ అలా అగ్రెసివ్‌గా ప్రవర్తించడం క్రీడా స్ఫూర్తి కాదు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం "క్రికెట్‌లో ఎమోషన్స్ సహజం, పెద్ద వికెట్ పడగానే బౌలర్ అలా స్పందించడం తప్పు కాదు" అని వెనకేసుకొస్తున్నారు. ఏదేమైనా జేమీసన్ గర్జన ఇప్పుడు ఐపీఎల్ 2026లో వైరల్ వీడియోగా నిలిచింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story