LSG vs CSK: చెన్నై బ్యాటర్లను ఎగతాళి చేసిన లక్నో బౌలర్.. ఈ స్లిప్‌ల గొడవేందిరా సామి
LSG vs CSK: ఐపీఎల్ 2026లో చెన్నై వర్సెస్ లక్నో మ్యాచ్‌లో హైడ్రామా చోటుచేసుకుంది.
LSG vs CSK: చెన్నై బ్యాటర్లను ఎగతాళి చేసిన లక్నో బౌలర్.. ఈ స్లిప్‌ల గొడవేందిరా సామి
Akash Singh: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకుంటున్న వేళ.. ప్రతి మ్యాచ్ ఒక యుద్ధాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. పంజాబ్ కింగ్స్‌ను వెనక్కి నెట్టి టాప్-4 లోకి దూసుకెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు అనివార్యం. ఇలాంటి చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో చెన్నై జోరుకు అడ్డుకట్ట వేయాలని లక్నో సూపర్ జెయింట్స్ పట్టుదలతో బరిలోకి దిగింది. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఏమాత్రం తడబాటు లేకుండా బౌలింగ్ ఎంచుకోగా.. ఆ తర్వాత మైదానంలో నడిచిన హైడ్రామా క్రికెట్ ప్రియులకు అసలైన మజాను అందించింది.
చెన్నై ఇన్నింగ్స్ ప్రారంభించిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ జోడీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గైక్వాడ్ తనదైన శైలిలో కొన్ని ఆకర్షణీయమైన బౌండరీలతో ఇన్నింగ్స్‌ను వేగంగానే ప్రారంభించాడు. అయితే, లక్నో యువ పేసర్ ఆకాష్ సింగ్ అద్భుతమైన ప్లాన్‌తో బరిలోకి దిగాడు. షార్ట్ లెంగ్త్ బంతితో గైక్వాడ్‌ను బోల్తా కొట్టించాడు. ఆ బంతిని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయిన గైక్వాడ్, మిడ్-ఆన్‌లో ఉన్న నికోలస్ పూరన్‌కు సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ షాక్ నుంచి చెన్నై కోలుకోకముందే, మరో ప్రమాదకర బ్యాటర్ సంజూ శాంసన్‌ను కూడా ఆకాష్ క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ పంపడంతో చెన్నై ఒక్కసారిగా డేంజర్‌లో పడింది.
జేబులోంచి పేపర్..
అయితే ఇక్కడ మ్యాచ్ కంటే ఎక్కువగా ఆకాష్ సింగ్ వికెట్ తీసిన తర్వాత చేసిన వినూత్న సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గైక్వాడ్ అవుట్ అవ్వగానే ఆకాష్ సింగ్ తన జేబులో నుంచి ఒక చిన్న కాగితం ముక్కను బయటకు తీశాడు. దాన్ని ఓపెన్ చేసి బ్యాటర్లకు చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఆ కాగితంపై “అక్కీ ఆన్ ఫైర్ – టీ20 ఆటలో వికెట్లు ఎలా తీయాలో ఆకాష్‌కు తెలుసు” అని రాసి ఉంది. శాంసన్ వికెట్ తీసినప్పుడు కూడా ఆకాష్ ఇదే ఇదే పేపర్ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ చెన్నై బ్యాటర్లను కాస్త ఎగతాళి చేశాడు. ఈ దూకుడు లక్నో శిబిరంలో విపరీతమైన ఉత్సాహాన్ని నింపగా, చెన్నై అభిమానులకు మాత్రం తీవ్ర ఆగ్రహం తెప్పించింది. క్రికెట్ మైదానంలో ఇలా కాగితాలు, నోట్స్ పట్టుకుని రావడం కొత్తేమీ కాదు. గతంలో కూడా కొందరు ఆటగాళ్లు ఇలాంటి పనులతో వార్తల్లో నిలిచారు.
🎥2️⃣ big wickets for Akash Singh 🔥
— IndianPremierLeague (@IPL) May 15, 2026
And a celebration you don't want to miss 🗒️👌
Updates ▶️ https://t.co/v1R8RJXPe8#TATAIPL | #KhelBindaas | #LSGvCSK | @LucknowIPL pic.twitter.com/jY76LqHMnb




