LSG vs RCB: లక్నోతో కీలక మ్యాచ్.. బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ.. పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rishabh Pant Comments Goes Viral. ఐపీఎల్ 2026లో భాగంగా ఎల్ఎస్‌జీ), ఆర్‌సీబీ జట్లు మరికాసేపట్లో తలపడుతున్నాయి.
LSG vs RCB: లక్నోతో కీలక మ్యాచ్.. బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ.. పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
LSG vs RCB: ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్లు మరికాసేపట్లో తలపడుతున్నాయి. కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించాడు. మరోవైపు జట్టులో కొన్ని కీలక మార్పులు చేసినట్లు లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. వరుస ఓటములతో ఎల్ఎస్‌జీ పట్టికలో 10వ స్థానంలో ఉండగా.. అద్భుత ఆటతో ఆర్‌సీబీ మూడో స్థానంలో ఉంది. ఇప్పటికే ఎల్ఎస్‌జీ ఇంటిదారి పట్టడంతో.. ఈ మ్యాచ్ ఆర్‌సీబీకె కీలకం.
టాస్ అనంతరం మాట్లాడిన రజత్ పాటిదార్.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని తెలిపాడు. 'లక్నో ప్రేక్షకుల మద్దతు చినస్వామి స్టేడియం స్థాయిలో లేకపోయినా.. మంచి ఎనర్జీ ఇస్తోంది. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడమే మా టార్గెట్. బ్రేక్ తర్వాత జట్టు ఆటగాళ్లు అందరూ మంచి ప్రాక్టీస్ చేశారు. ప్లేయర్స్ గెలవడానికి డుగుతున్నారు. ఎలాంటి మార్పులు లేకుండా గత మ్యాచ్ జట్టునే కొనసాగిస్తున్నాము' అని వెల్లడించాడు.
లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ జట్టులో కొన్ని కీలక మార్పులు చేసినట్లు తెలిపాడు. 'మా జట్టులో కొందరు ఆటగాళ్లకు గాయాలయ్యాయి. గాయాల కారణంగా జోష్ ఇంగ్లిస్, మొహ్సిన్ ఖాన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. వారి స్థానాల్లో అర్షిన్ కులకర్ణి, షాబాజ్ అహ్మద్ జట్టులోకి వచ్చారు. మరింత స్పష్టతతో ముందుకు సాగడమే మా ముఖ్య ఉద్దేశం. మేమంతా అగ్రశ్రేణి ఆటగాళ్లమని మాకు తెలుసు. కానీ అదే సమయంలో కొన్నిసార్లు స్పష్టత లోపించినప్పుడు ఓటములు ఎదురవుతాయి. క్రికెట్‌లో అలా జరగవచ్చు. జట్టులో స్పష్టత చాలా ముఖ్యం, అవసరమైనప్పుడు మార్పులు చేయాల్సిందే' అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ పిచ్‌పై 180-190 పరుగులు మంచి స్కోరుగా భావిస్తున్నట్లు తెలిపాడు.
తుది జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: జాకబ్ బెతెల్, విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్య, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాశ్ శర్మ, రసిఖ్ సలామ్ దార్, జోష్ హేజిల్‌వుడ్.
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, అర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఐదెన్ మార్‌క్రమ్, రిషభ్ పంత్ (కెప్టెన్), అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షహబాజ్ అహ్మద్, దిగ్వేశ్ సింగ్ రాఠీ, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్.
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ లిస్ట్:
ఆర్‌సీబీ: జోర్డాన్ కాక్స్, టిమ్ డేవిడ్, మంగేశ్ యాదవ్, విక్కీ ఓత్సవాల్, వెంకటేశ్ అయ్యర్.
ఎల్ఎస్‌జీ: మయాంక్ యాదవ్, ముకుల్ చౌదరి, అబ్దుల్ సమద్, మణమారన్ సిద్ధార్థ్, అవేశ్ ఖాన్.




