LSG vs RR: విఫలమైన రాజస్థాన్ టాప్ బ్యాటర్లు, జడేజా గ్రేట్ ఫైట్.. లక్నో ముందు ఛేదించే లక్ష్యం!
LSG vs RR: ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
LSG vs RR: విఫలమైన రాజస్థాన్ టాప్ బ్యాటర్లు, జడేజా గ్రేట్ ఫైట్.. లక్నో ముందు ఛేదించే లక్ష్యం!
LSG vs RR: ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య లమ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మయాంక్ యాదవ్ వేసిన 20వ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. లేదంటే ఆర్ఆర్ మరింత తక్కువ స్కోరుకే పరిమితం అయ్యేది. రాజస్థాన్ బ్యాటర్లలో రవీంద్ర జడేజా టాప్ స్కోరర్. 29 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సుతో 43 రన్స్ చేశాడు. ఇన్నింగ్స్ చివరలో డోనోవన్ ఫెరీరా (20), శుభమ్ దూబె (19)లు చెలరేగారు. లక్నో బౌలర్లలో మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్ తలో రెండు వికెట్స్ పడగొట్టారు.
ఇన్నింగ్స్ ప్రారంభంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 12 బంతుల్లో 22 పరుగులు చేసి మంచి ఆరంభం ఇచ్చినా త్వరగానే ఔటయ్యాడు. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ 11 బంతుల్లో 8 పరుగులు చేసి నిరాశపరిచాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడం రాజస్థాన్‌కు పెద్ద దెబ్బగా మారింది. ఈ సమయంలో కెప్టెన్ రియాన్ పరాగ్ 20 పరుగులు, షిమ్రాన్ హెట్మయర్ 22 పరుగులతో జట్టును ఆదుకున్నారు. అయితే మధ్యలో వికెట్లు వరుసగా పడటంతో ఆర్‌ఆర్ ఒత్తిడిలో పడింది.
ఆల్‌రౌండర్ ఆర్ జడేజా అద్భుతంగా ఆడి జట్టును గౌరవప్రదమైన స్కోర్‌కి చేర్చాడు. చివర్లో డోనోవన్ ఫెరీరా, శుభమ్ దూబెలు జట్టుకు కీలక రన్స్ జోడించారు. లక్నో బౌలర్లలో మహమ్మద్ షమీ 2 వికెట్లు తీశాడు. మోసిన్ ఖాన్ అద్భుత బౌలింగ్‌తో 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ప్రిన్స్ యాదవ్ కూడా 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ మాత్రం భారీగా రన్స్ ఇచ్చాడు.




