LSG vs RR Toss: టాస్ గెలిచిన లక్నో, స్పీడ్ స్టర్ వచ్చేశాడు.. 'బుడ్డోడు' వైభవ్‌కు దబిడిదిబిడే!
LSG vs RR Toss: ఐపీఎల్ 2026లో భాగంగా మరికాసేపట్లో లక్నో, రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
LSG vs RR Toss: టాస్ గెలిచిన లక్నో, స్పీడ్ స్టర్ వచ్చేశాడు.. 'బుడ్డోడు' వైభవ్‌కు దబిడిదిబిడే!
LSG vs RR Toss: ఐపీఎల్ 2026లో భాగంగా మరికాసేపట్లో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేయనుంది. తుది జట్టులో రెండు మార్పులు చేసినట్లు పంత్ తెలిపాడు. సిద్ స్థానంలో దిగ్వేష్ సింగ్ రాఠీ, ఆవేష్ స్థానంలో మయాంక్ యాదవ్ ఆడుతున్నారు. స్పీడ్ స్టర్ మయాంక్ రాకతో లక్నో బౌలింగ్ పటిష్టం అయింది. తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని రాజస్థాన్ సారథి రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.
గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 54 పరుగుల తేడాతో ఓటమి పాలైన లక్నో.. ఈ మ్యాచ్‌లో గెలవాలని చూస్తోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న ఎల్‌ఎస్‌జీకి విజయం తప్పనిసరి. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. మరలా తిరిగి గాడిలో పడాలని ఆర్ఆర్ భావిస్తోంది. ఆడిన 6 మ్యాచ్‌లలో నాలుగు విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలవడం రాజస్థాన్ కంటే.. లక్నోకే అత్యంత ముఖ్యం. చూడాలి మరి ఏ జట్టు విజయం అందుకుంటుందో.
తుది జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఆయుష్ బదోని, రిషభ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్), నికోలస్ పూరన్, ఐదెన్ మార్‌క్రమ్, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, మోహ్సిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్ సింగ్ రాఠీ, మయాంక్ యాదవ్.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), హెట్‌మయిర్, ఫెర్రీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేశ్ శర్మ, నాంద్రే బర్గర్.
ఇంపాక్ట్ ప్లేయర్స్:
లక్నో: హిమ్మత్ సింగ్, జార్జ్ లిండే, మణిమారన్ సిద్ధార్థ్, మాథ్యూ బ్రీట్జ్కే, అబ్దుల్ సమద్.
రాజస్థాన్: లువాన్-డ్రే ప్రిటోరియస్, రవి సింగ్, యశ్ రాజ్ పుంజా, శుభమ్ దూబే, తుషార్ దేశ్‌పాండే.




