IPL 2026: మూడు సీజన్‌లలో ఆడింది ఆరు మ్యాచ్‌లే.. అయినా ఆ టీమిండియా ఆటగాడికి ఫుల్ క్రేజ్!
IPL 2026: భారత యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గురించి ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. మయాంక్ బౌలింగ్ వేగం ప్రపంచ స్థాయి బౌలర్లను తలపిస్తున్నప్పటికీ.. తరచూ గాయాలు అతని కెరీర్‌కు పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి. అయినప్పటికీ ఐపీఎల్ ప్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) అతనిపై నమ్మకం ఉంచి.. 2026 సీజన్ కోసం రిటైన్ చేసింది.
IPL 2026: మూడు సీజన్‌లలో ఆడింది ఆరు మ్యాచ్‌లే.. అయినా ఆ టీమిండియా ఆటగాడికి ఫుల్ క్రేజ్!
IPL 2026: భారత యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గురించి ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. మయాంక్ బౌలింగ్ వేగం ప్రపంచ స్థాయి బౌలర్లను తలపిస్తున్నప్పటికీ.. తరచూ గాయాలు అతని కెరీర్‌కు పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి. అయినప్పటికీ ఐపీఎల్ ప్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) అతనిపై నమ్మకం ఉంచి.. 2026 సీజన్ కోసం రిటైన్ చేసింది. ఢిల్లీకి చెందిన మయాంక్‌ను లక్నో ప్రాంచైజీ ఏకంగా రూ.11 కోట్లకు రిటైన్ చేసుకుంది. మూడు సీజన్‌లలో ఆడింది ఆరు మ్యాచ్‌లే అయినా.. మయాంక్‌పై ఎల్‌ఎస్‌జీ ఉంచుకున్న నమ్మకానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
2022 మెగా వేలంలో రూ.20 లక్షలు
మయాంక్ యాదవ్‌ను 2022 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ.20 లక్షలకు తీసుకుంది. కానీ ఆ సీజన్‌లో అతడికి ఆడే అవకాశం రాలేదు. గాయం కారణంగా ఐపీఎల్ 2023 నుంచి వైదొలిగాడు. కానీ మయాంక్‌పై ఎల్‌ఎస్‌జీ నమ్మకం మాత్రం కొనసాగించింది. 2024 ఐపీఎల్‌లో ఆడిన మయాంక్ బుల్లెట్ లాంటి బంతులు విసిరాడు. ఆడింది నాలుగు మ్యాచ్‌లే ఎంతో ప్రభావం చూపించాడు. నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తూ.. ఏడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. అయితే గాయం కారణంగా మయాంక్ త్వరగా టోర్నీని వీడాల్సి వచ్చింది.
మయాంక్ క్రేజ్ మాత్రం తగ్గలేదు:
2025 సీజన్‌లో మయాంక్ యాదవ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ.11 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయినా అతడి పరిస్థితి పెద్దగా మారలేదు. ఆ సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. ఇలా మూడు సీజన్లలో కలిపి మొత్తం ఆరు మ్యాచ్‌లే ఆడటం అతని కెరీర్‌పై గాయాల ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది. మూడు సీజన్‌లలో ఆడింది ఆరు మ్యాచ్‌లే అయినా మయాంక్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఐపీఎల్ 2026 కోసం ఎల్‌ఎస్‌జీ మరోసారి రూ.11 కోట్లకు రిటైన్ చేసింది. ప్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఫిట్‌నెస్ కాపాడుకుంటూ.. ఐపీఎల్ 2026లో అతడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.
వేగమే మయాంక్ యాదవ్ ప్రత్యేకత:
మయాంక్ యాదవ్ ప్రత్యేకత అతని వేగమే. కేవలం 23 ఏళ్ల వయస్సులోనే గంటకు సుమారు 160 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగల సామర్థ్యం అతనికి ఉంది. ఈ కారణంగానే లక్నో సూపర్ జెయింట్స్ మేనేజ్‌మెంట్ అతనిపై విశ్వాసం ఉంచింది. గాయాల సమస్యను అధిగమిస్తే భవిష్యత్తులో అతను భారత క్రికెట్‌కు కీలక ఫాస్ట్ బౌలర్‌గా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మయాంక్ ఫిట్‌గా ఉంటే అతని వేగం ప్రత్యర్థి బ్యాటర్లకు పెద్ద సవాలుగా మారుతుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో అతను పూర్తి ఫిట్‌గా ఆడి తన ప్రతిభను నిరూపించుకోవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.




