MI vs CSK: టాస్ గెలిచిన ముంబై, చెన్నైదే బ్యాటింగ్.. అభిమానులకు మాత్రం డబుల్ షాక్!
MI vs CSK: ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై, చెన్నై మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన హార్దిక్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
MI vs CSK: టాస్ గెలిచిన ముంబై, చెన్నైదే బ్యాటింగ్.. అభిమానులకు మాత్రం డబుల్ షాక్!
MI vs CSK: ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో మరికొద్దిసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో చెన్నై తొలుత బ్యాటింగ్ చేయనుంది. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని హార్దిక్ చెప్పాడు. జట్టులో రెండు మార్పులు చేసినట్లు చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. టాస్ నేపథ్యంలో అభిమానులకు మాత్రం డబుల్ షాక్ తగిలింది. దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలు ఈ మ్యాచ్‌లో ఆడుతారనుకున్నా..కనీసం ఇంపాక్ట్ ప్లేయర్ లిస్టులో కూడా లేరు. దాంతో చెన్నై, ముంబై జట్ల అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు.
చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. తాము కూడా టాస్ గెలిస్తే బౌలింగ్‌నే ఎంచుకునేవాళ్లమని చెప్పాడు. వాంఖడే మైదానం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని, ముందుగా బ్యాటింగ్ చేసినా మంచి స్కోర్ చేయాల్సిందేనని అన్నాడు. గత మ్యాచ్‌ల్లో కొన్ని అవకాశాలను వినియోగించుకోలేకపోయామని, కానీ జట్టు మొత్తం ఆత్మవిశ్వాసంతో ఉందని తెలిపాడు. ఎంఎస్ ధోనీ లేకపోయినా అభిమానుల మద్దతు ఎప్పటికీ అలాగే ఉంటుందన్నాడు. ఈరోజు గెలిచి అభిమానుల ముఖాల్లో చిరునవ్వు కలిగిస్తామని గైక్వాడ్ ధీమా వ్యక్తం చేశాడు.
ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ముందుగా బౌలింగ్ చేయడమే సరైన నిర్ణయమని భావించామని చెప్పాడు. గత మ్యాచ్‌లో జట్టు సమష్టిగా ప్రదర్శన కనబరిచిందని, అదే ఉత్సాహాన్ని కొనసాగించాలని కోరుకున్నాడు. ఆటను ఆస్వాదిస్తూ ఆడితేనే మంచి ఫలితాలు వస్తాయని, ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా ఫన్‌తో ఆడాలని సూచించాడు. పిచ్ పచ్చగా కనిపించినా గత మ్యాచ్‌ల మాదిరిగానే మంచి ట్రాక్‌గా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్థి జట్టు ఎంత స్కోర్ చేస్తుందో చూసి లక్ష్యాన్ని ఛేదించడంపై దృష్టి పెట్టామని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో గెలవడం రెండు జట్లకు అత్యంత కీలకం. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే.. తప్పక విజయం సాధించాల్సి ఉంది.
తుది జట్లు:
ముంబై: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), తిలక్ వర్మ, రూథర్ ఫోర్డ్, మిచెల్ శాంట్నర్, జస్‌ప్రీత్ బుమ్రా, క్రిష్ భగత్, ఏఎమ్ ఘజన్‌ఫర్, అశ్వని కుమార్.
చెన్నై: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, డెవాల్డ్ బ్రేవిస్, శివమ్ దూబె, కార్తిక్ శర్మ, జెమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ముకేశ్ చౌదరి.
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్లు:
ముంబై: విల్ జాక్స్, రాజ్ భావ, శార్దూల్ ఠాకూర్, దానిష్ మలేవర్, మయాంక్ మార్కండే.
చెన్నై: ప్రశాంత్ వీర్, మ్యాథ్యూ షార్ట్, మ్యాట్ హెన్రీ, అకేల్ హొసేన్, ఉర్విల్ పటేల్.




