Cricket: ధనా ధన్.. ఫటా ఫట్.! 15 బంతుల్లో 70 పరుగులు.. కట్ చేస్తే అద్భుత విజయం..

Cricket: హాంకాంగ్ సిక్సెస్‌లో స్కాట్లాండ్ ప్లేయర్ లీస్క్ 15 బంతుల్లో 70 చేయగా.. ఆ ఇన్నింగ్స్‌కు శ్రీలంక జట్టు చతికిలబడింది.

Ravi
By Ravi
Published on: 31 Oct 2026 8:19 PM IST
Cricket
X

Cricket: ధనా ధన్.. ఫటా ఫట్.! 15 బంతుల్లో 70 పరుగులు.. కట్ చేస్తే అద్భుత విజయం..

Cricket: హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ ప్లేయర్ మైఖేల్ లీస్క్ 15 బంతుల్లో 70 రన్స్ కొట్టి అజేయంగా నిలిచాడు. ఇందులో 10 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. దీంతో స్కాట్లాండ్ 6 ఓవర్లలో 144/4 స్కోర్ చేసింది.

ఛేజింగ్‌లో లంక 118/3 స్కోరుకే పరిమితమై 26 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఈ ఇన్నింగ్స్‌తో లీస్క్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. ఈ టోర్నీలో జట్టుకు ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే ఆడతారు. 5 వికెట్లు పడిన తర్వాత సింగిల్ ప్లేయర్ కూడా బ్యాటింగ్ చేస్తాడన్న సంగతి తెలిసిందే.

మరోవైపు భారత్‌కు ఈ టోర్నీలో వరుస ఓటములు ఎదురయ్యాయి. పాకిస్థాన్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిన భారత్, గ్రూప్ C మ్యాచ్‌లో UAE చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో నితీష్ రాణా రెండో బంతికే ఔటయ్యాడు. రాహుల్ తెవాటియా, శశాంక్ సింగ్ కూడా త్వరగా వెనుదిరగడంతో భారత్ 14/3తో కష్టాల్లో పడింది. రాహుల్ త్రిపాఠి 24, కృనాల్ పాండ్యా 15 రన్స్ చేశారు.

నటరాజన్ 14 బంతుల్లో 38 రన్స్‌తో రాణించడంతో భారత్ 6 ఓవర్లలో 94/6 స్కోర్ చేసింది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన భారత్ గ్రూప్ C చివరి స్థానంలో నిలిచింది. అటు చివరి మ్యాచ్‌లోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. ఇంగ్లండ్ 6 ఓవర్లలో 124/2 స్కోర్ చేయగా, భారత్ 121/4కే పరిమితమై 3 రన్స్ తేడాతో ఓడిపోయింది. దీంతో మూడు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలై.. టీమిండియా టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.