Rohit Sharma: బీసీసీఐ ఒక్క మాట చెబితే.. రోహిత్ రెచ్చిపోతాడు.. హిమాలయాలను కూడా ఎక్కేస్తాడు!
Rohit Sharma: Mohammad Kaif backs Rohit Sharma amid retirement speculation. టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఇటీవల తీవ్ర స్థాయిలో చర్చ జరిగిన విషయం తెలిసిందే.
Rohit Sharma: బీసీసీఐ ఒక్క మాట చెబితే.. రోహిత్ రెచ్చిపోతాడు.. హిమాలయాలను కూడా ఎక్కేస్తాడు!
Rohit Sharma: టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఇటీవల తీవ్ర స్థాయిలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. లార్డ్స్ వన్డేనే కెరీర్లో చివరిదని ప్రచారం జరిగింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 138 పరుగులతో అద్భుత సెంచరీ బాదిన రోహిత్.. తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. రోహిత్‌పై వచ్చిన ఈ విమర్శలపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందించాడు. భారత క్రికెట్‌కు ఎన్నో సేవలు చేసిన రోహిత్ ఎప్పుడు రిటైర్ కావాలనేది అతనే నిర్ణయించుకోవాలని, ఆ హక్కు పూర్తిగా అతనిదేనని కైఫ్ స్పష్టం చేశాడు.
తన ‘ఎక్స్’ ఖాతాలో వీడియో విడుదల చేసిన మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ... 'రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఎప్పుడు అనేది అతనే నిర్ణయించుకోవాలి. భారత జట్టు కోసం అతను ఎంతో కష్టపడ్డాడు. 12 వేలకు పైగా అంతర్జాతీయ పరుగులు, 34 సెంచరీలు చేశాడు. కెప్టెన్‌గా ఉన్నంతకాలం వైట్‌బాల్ క్రికెట్‌లో భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. అలాంటి ఆటగాడికి తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే పూర్తి హక్కు ఉంది. గత కొంతకాలంగా రిటైర్మెంట్ తీసుకోవాలంటూ రోహిత్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. రిటైర్ అవ్వాలి అనే మాటలు బాగా వినిపిస్తున్నాయి. అలాంటి ఒత్తిడిలోనే లార్డ్స్‌లో అద్భుత సెంచరీ చేశాడు. లార్డ్స్ వన్డే చరిత్రలో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. అదే అతని గొప్పతనానికి నిదర్శనం' అని కొనియాడాడు.
రోహిత్‌కు ప్రస్తుతం జట్టు నుంచి మద్దతు అవసరమని కైఫ్ పేర్కొన్నాడు. 'ఒకవేళ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మీడియా ముందుకు వచ్చి 2027 ప్రపంచ కప్‌లో కూడా రోహిత్ భాయ్ మాకు కావాలి అని చెప్పాలి. లేదా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐ కలిసి రోహిత్‌కు మేమున్నాం, అతను ఆడాలనుకున్నంత కాలం జట్టులో ఉంటాడు అని ప్రకటిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ప్రస్తుతం తనకు ఎవరూ అండగా లేరనే భావనతో రోహిత్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. అతను ఎప్పుడు విఫలమవుతాడా అని చాలామంది ఎదురుచూస్తున్నారు. కానీ జట్టు, కెప్టెన్, కోచ్ తన వెంటే ఉన్నారని రోహిత్‌కు నమ్మకం కలిగితే.. అతను హిమాలయాలను కూడా ఎక్కేస్తాడు. భారత జట్టు కోసం తన శక్తి మేరకు మరింత అద్భుతంగా ఆడతాడు' అని చెప్పాడు.
రోహిత్ శర్మపై అనవసరమైన చర్చలు, విమర్శలు ఆపాలని మహ్మద్ కైఫ్ సూచించాడు. 'ఇకనైనా అందరూ ప్రశాంతంగా ఉండాలి. రోహిత్ శర్మను స్వేచ్ఛగా ఆడనివ్వాలి. అతని బ్యాట్ ఇంకా భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించగలదు. 2027 ప్రపంచ కప్‌లో రోహిత్ ఆడాలి. ఆడుతాడని నేను అనుకుంటున్నా' అని కైఫ్ చెప్పుకొచ్చాడు. రోహిత్ 2027 ప్రపంచ కప్ వరకు జట్టులో కొనసాగనున్నాడు. వన్డే ప్రపంచ కప్ గెలవడం రోహిత్ కల అన్న విషయం తెలిసిందే.




