Mohammed Shami: 2027 వరల్డ్ కప్‌లో ఆడతారా.? లెక్కపెట్టడం ఆపేశానంటూ షమీ ఆసక్తికర కామెంట్స్!

Mohammed Shami: 2027 వరల్డ్ కప్‌లో జట్టులోకి పిలుపు వస్తుందనే ఆలోచనలకు తాను దూరంగా ఉన్నానని, తన ఫోకస్ అంతా ఆటపైనే ఉందని భారత బౌలర్ మహ్మద్ షమీ తెలిపారు, IPL, రాష్ట్ర జట్టు తరపున ఆడతానని చెప్పారు.

Ravi
By Ravi
Published on: 29 Nov 2026 9:04 AM IST
Mohammed Shami
X

Mohammed Shami: 2027 వరల్డ్ కప్‌లో ఆడతారా.? లెక్కపెట్టడం ఆపేశానంటూ షమీ ఆసక్తికర కామెంట్స్!

Mohammed Shami: 2027 వరల్డ్ కప్‌లో జట్టులోకి పిలుపు వస్తుందనే ఆలోచనలకు తాను దూరంగా ఉన్నట్లు భారత బౌలర్ షమీ తెలిపారు. 2027 వన్డే వరల్డ్ కప్‌పై గానీ, 2028 టీ20 వరల్డ్ కప్‌పై గానీ ఆలోచిస్తున్నారా అని అడిగితే, ఆ లెక్కలన్నీ ఆపేశానని చెప్పారు. తన ఫోకస్ అంతా ఆటపైనే ఉందని, సెలక్టర్లు ఏది నిర్ణయిస్తే అదే మంచిదని అభిప్రాయపడ్డారు.

తన సైడ్ నుంచి ఇదే రిథమ్‌ను కొనసాగిస్తూ ఐపీఎల్, స్టేట్ తరపున ఆడతానన్నారు. క్రికెట్‌ను ఎంత కాలం ఇష్టపడతానో అంతకాలం ఆటను ఎంజాయ్ చేస్తూ ఆడతానని చెప్పారు. షమీ 2023 వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు. ఆ టోర్నీలో న్యూజిలాండ్‌పై ముంబైలో 57 పరుగులకు 7 వికెట్లు తీసి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా ఆయనే. 18 మ్యాచ్‌ల్లో 55 వికెట్లు పడగొట్టారు.

36 ఏళ్ల షమీ చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరపున ఆడారు. ఇటీవలే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం బెంగాల్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నారు. IPL 2027 సీజన్‌లో ఆయన రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడనున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ట్రేడ్ డీల్ ద్వారా ఆ జట్టుకు మారారు. రాజస్థాన్ జట్టులో వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లతో కలిసి ఆడేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు.

షమీ ఫిట్‌నెస్‌పై గతంలో చర్చ జరిగింది. ఆయన ఫిట్‌నెస్‌పై తమకు అప్‌డేట్ లేదని సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ చెప్పారు. దీనికి షమీ, తాను శిఖరస్థాయి ఫిట్‌నెస్‌లో ఉన్నానని బదులిచ్చారు. షమీని పక్కన పెట్టడం అన్యాయమని బెంగాల్ కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా విమర్శించారు.

షమీ దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించడం ఆనందంగా ఉందని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. అయితే వరల్డ్ కప్ అవకాశాలపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.